

- ఆకట్టుకుంటున్న ‘పోచమ్మ’ టైటిల్ గ్లింప్స్
- కాంతార రేంజ్ లో సౌండ్ చేస్తుందా?
తెలంగాణ గ్రామ దేవతల పేర్లతో ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలు, సిరీస్ లు రూపొందించబడ్డాయి. ఇప్పటికే ఎల్లమ్మ, మారెమ్మ సినిమాలు ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడే బాటలో ఒక వెబ్ సిరీస్ రాబోతుంది.
ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా నుంచి వస్తున్న వెబ్ సిరీస్ ‘పోచమ్మ'(పోచమ్మ). మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సిరీస్ కి రమేష్ ఇంద్ర దర్శకుడు. శృతి నాయుడు తయారయ్యారు. “మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది” అంటూ తాజాగా టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు.
50 సెకన్లతో రూపొందించిన ‘పోచమ్మ’ గ్లింప్స్ ఇంటెన్స్ గా ఉంది. ఒక ఇంటిలో ఏం జరిగింది? దానికి సాక్షిగా నిలిచిన పోచమ్మ తల్లి ఏం చేసింది? అనేలా గ్లింప్స్ సాగింది. డివోషనల్ టచ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఒక మంచి సిరీస్ చూడబోతున్నామనే ఫీలింగ్ ని కలిగించింది. ముఖ్యంగా గ్లింప్స్ లో ఎల్.వి. గణేశన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కట్టిపడేసింది.

“నువ్వు పాపాన్ని దాచవచ్చు. నిజాన్ని దాచవచ్చు. కానీ సాక్షి నోరు మూయించలేవు.” అంటూ ‘పోచమ్మ’ సిరీస్ ఎలా ఉంటుందో మేకర్స్ తెలియజేసారు. ఈ సిరీస్ ఆహా వేదికగా ఏప్రిల్ లో స్ట్రీమింగ్ కి రానుంది.
ప్రాంతీయ ఆచారాలకు తెరరూపం ఇచ్చిన కన్నడ చిత్రం ‘కాంతార’ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అదే స్ఫూర్తితో తెలుగు మేకర్స్ కూడా ఇక్కడి గ్రామ దేవతల మహిమల నేపథ్యంలో కొన్ని కథలను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఎల్లమ్మ’, ‘మారెమ్మ’ సినిమాలు, ‘పోచమ్మ’ సిరీస్‌కి మంచి ఆదరణ లభిస్తే.. మరికొందరు మేకర్స్ ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: ‘ధురంధర్ 2’ ట్రైలర్ రెస్పాన్స్.. నెట్ ఫ్లిక్స్ ఎందుకు తప్పుకుంది?