Home Uncategorized కోమట్లగూడెం లో మనుశ్రీ కి రూ.10,016 పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్

కోమట్లగూడెం లో మనుశ్రీ కి రూ.10,016 పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్

by VRM Media
0 comments

vrm media ప్రతినిధి ఖమ్మం

_కీ,శే లు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో

ఖమ్మం /మార్చి10

ఖమ్మం:– చింతకాని మండలం కోమట్ల గూడెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి జాతర సందర్భంగా నిర్వహించిన డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.ఈ సందర్భంగా అమర జీవిమాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ కోమట్లగూడెం వైయస్సార్ యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కన్సొలేషన్ బహుమతి ఇవ్వడం జరిగింది. కనతాల *రాంబాబు – సరిత దంపతుల కుమార్తె మను శ్రీ కు రూ.10,016 కన్సొలేషన్ బహుమతిగా అందజేశారుఅంతేకాకుండా చిన్నారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ మొత్తం మొత్తాన్ని ఈరోజు గ్రామంలోని పోస్ట్ ఆఫీస్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం జరిగింది. చిన్నారి విద్యాభివృద్ధికి ఉపయోగపడేలా
*ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైయస్సార్ యూత్ సభ్యులు తెలిపారు.. ఈ సందర్భంగా మను శ్రీ తల్లిదండ్రులు వైఎస్ఆర్ యూత్ కు కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన గ్రామ పెద్దలు, యువకులు,నిర్వాహకులు మరియు గ్రామ ప్రజలందరికీ వైయస్సార్ యూత్ తరఫున పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సామాజిక సేవకు, చిన్నారుల ప్రోత్సాహానికి మంచి ఉదాహరణగా నిలిచింది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల్లో యువత పాల్గొనాలని నేటి బాలలే
రేపటి పౌరులుగా
కీర్తించబడాలంటే స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సహాయ సహకారాలు అందించాలని గ్రామ పెద్దలు ప్రజలు యువతి యువకులు కోరారు

2,804 Views

You may also like

Leave a Comment