Home Uncategorized గుడ్లు నాణ్యత లేకపోతే గుత్తేదారుల పై చర్యలు తప్పవు

గుడ్లు నాణ్యత లేకపోతే గుత్తేదారుల పై చర్యలు తప్పవు

by VRM Media
0 comments

గుడ్లు నాణ్యత లేకపోతే గుత్తేదారుల పై చర్యలు తప్పవు
పోతవరం ఎంపీపీ పాఠశాలలో పాడైపోయిన గుడ్లు వ్యవహారం పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
ఉన్నతాధికారుల దృష్టికి మెనూ సమస్యలు
ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి
(VMR- ఐనవిల్లి భద్రం)
విద్యార్ధులకు అందించే ఆహార పదార్థాల మెనూలో ఎలాంటి లోపాలు ఉన్నా సహించేది లేదని రంపచోడవరం ఎమ్మెల్యే ,రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. దేవీపట్నం మండలంలో ఆమె మంగళవారం పలు పాఠశాలలు, వసతి గృహాలపై సుడిగాలి పర్యటన చేశారు.
దేవీపట్నం మండలం పోతవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేసిన ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఆ పాఠశాలలో పాడైపోయిన గుడ్లు విద్యార్ధులకు అందించిన సంఘటన పై ఆరా తీసారు. రికార్డులు పరిశీలించి వాస్తవంగా రికార్డు ప్రకారం 181గుడ్లు ఉండాల్సి ఉండగా తేడా ఉన్నట్లు గుర్తించారు. అలాగే పాఠశాల ప్రధానోపాద్యాయులు కె.రామకృష్ణ దొర, వంటమనిషి రామలక్ష్మిలకు హెచ్చరిక జారీ చేశారు. గుత్తేదారులు సకాలంలో అందించే పూర్తి నాణ్యతతో ఉన్న సరుకులు మాత్రమే తీసుకోవాలన్నారు. ఒకవేళ గుత్తేదారులు నాణ్యత లేని సరకులు సరఫరా చేస్తే తిరస్కరించాలన్నారు. అలా కాని పక్షంలో నిర్లక్ష్యం ఎవరిదైతే ఉందో వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. అన్ని రకాల పదార్థాలు తనిఖీ చేసి పరిశీలించారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు పెట్టొద్దని సూచించారు. దీనిపై ఐటిడిఎ PO, జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం
కాకుండా చూసుకోవాలన్నారు. గుత్తేదారుల్ని కూడా అవసరం అయితే మార్చడానికి ఉన్నతాధికారులకు నివేదించినట్లు పేర్కొన్నారు. అనంతరం దామనపల్లి ఆశ్రమ బాలికల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్ధులతో మాట్లాడారు. ఉత్తీర్ణత శాతం పెంపుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు..ఈ కార్యక్రమం లో టీడీపీ మండల నాయకులు పాల్గొనగా జనసేనపార్టీ సీనియర్ నాయకులు ఐనవిల్లి భద్రం,పి న్ మూర్తి,మీడియా కోఆర్డినేట కారం దుర్గాప్రసాద్పాల్గొన్నారు. ✍️✊🔯

2,802 Views

You may also like

Leave a Comment