Home ఎంటర్‌టెయిన్మెంట్ ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘పెన్నుమ్ పోరాట్టమ్’ – VRM MEDIA

ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘పెన్నుమ్ పోరాట్టమ్’ – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


  • ఓటీటీలోకి మలయాళ సెటైరికల్ ఫిల్మ్
  • గా మొదటి సినిమాతోనే డైరెక్టర్ హిట్ కొట్టిన యాక్టర్

మలయాళ సినిమాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంది. అక్కడ హిట్టయిన సినిమాలను వివిధ భాషలలో డబ్ చేసి ఓటీటీలో స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల్లోనూ మలయాళ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. రీసెంట్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘పెన్నుమ్ పోరాట్టమ్'(పెన్నమ్ పోరాటం) ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.

మలయాళ నటుడు రాజేష్ మాధవన్ దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘పెన్నుమ్ పోరాటమ్’. ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సెటైరికల్ డ్రామా.. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందింది. నెల రోజులకే ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఇస్తోంది.

‘పెన్నుమ్ పోరాట్టమ్’ ఓటీటీ రైట్స్ ని దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్.. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ని రివీల్ చేసింది. మార్చి 13 నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ సంస్థ.

కేరళలోని ఒక గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ గ్రామంలో కట్టుబాట్లు ఏంటి? వాటిని చారులత అనే యువతి, ఆమె పెంపుడు కుక్క ‘సుట్టు’ బ్రేక్ చేయడంతో ఏం జరిగింది? అనేది చూపిస్తూ.. మనుషుల కంటే జంతువులే నయమనే కోణంలో సెటైరికల్‌గా ఉంటుందీ సినిమా.

రాజేష్ మాధవన్, రైనా రాధాకృష్ణన్, సుభాష్ చంద్రన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో.. కుక్క పాత్రకు హీరో టొవినో థామస్ వాయిస్ ఓవర్ అందించడం విశేషం.

ఇది కూడా చదవండి: మరో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తున్న ప్రభాస్!

2,801 Views

You may also like

Leave a Comment