Home Uncategorized ఒంటిమిట్ట కోదండరామాలయం అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపం? అన్నదాన కౌంటర్ నిర్మాణాలకు బీటలు

ఒంటిమిట్ట కోదండరామాలయం అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపం? అన్నదాన కౌంటర్ నిర్మాణాలకు బీటలు

by VRM Media
0 comments

బ్రహ్మోత్సవాల ముందే బయటపడిన నిర్మాణ లోపాలు – కాంట్రాక్టర్లు, అధికారులపై భక్తుల ఆరోపణలు

VRM న్యూస్ బాల మొలాలి ఒంటిమిట్ట

వైఎస్ఆర్ జిల్లా కడపలోని ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఈ నెల 26 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల నాణ్యతపై భక్తుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆలయం ఎదురుగా నూతనంగా నిర్మిస్తున్న అన్నదాన కౌంటర్ రోడ్డు కు బీటలు పడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
బ్రహ్మోత్సవాలకు ముందు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో అన్నదాన క్షేత్రం నిర్మాణం చేపట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రారంభోత్సవం జరగకముందే రోడ్డు పగుళ్లు కనిపించడం నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. దీనికి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు.
అభివృద్ధి పనుల పర్యవేక్షణలో అధికారుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పనుల నాణ్యతపై వివరణ కోరేందుకు సంబంధిత అధికారిని సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ ఫోన్‌కు స్పందించలేదని అంటున్నారు.
ఇదే కాంట్రాక్టర్ గతంలో నిర్వహించిన పనుల నాణ్యతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయని కొందరు భక్తులు చెబుతున్నారు. ఆలయ అభివృద్ధి పనుల్లో కొందరు సబ్ కాంట్రాక్టర్లు ప్రధాన కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నప్పటికీ వాటిని పై అధికారుల దృష్టికి వెళ్లకుండా చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత కొన్ని సంవత్సరాలుగా దిగువ స్థాయిలో పనిచేస్తున్న ఒక అధికారి ఎవరినీ పట్టించుకోరని, కాంట్రాక్టర్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధి పనుల నాణ్యతపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

2,801 Views

You may also like

Leave a Comment