డాక్టర్ పి. బావ నా రెడ్డి. డాక్టర్ పి అరుణ జ్యోతి ఆధ్వర్యంలో
ముఖ్యఅతిథిగా హాజరైన ZPTC అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి
VRM న్యూస్ బాల మౌలాలి మార్చి 12
మండల కేంద్రమైనఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సి.భావన,డాక్టర్ పి.అరుణ జ్యోతి ఆధ్వర్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత HPV(హ్యూమన్ ప్యాపిలోమా వైరస్)వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 14 సంవత్సరాల ఆడపిల్లలకు వ్యాక్సిన్ వెయ్యడం జరిగింది.ముఖ్య అతిథిగా ZPTC ముద్దు కృష్ణారెడ్డి హాజరై వ్యాక్సిన్ వేయించుకున్న పిల్లలకు పండ్లు పంపిణీ చెయ్యడం జరిగింది. వ్యాక్సిన్ వేసుకున్న వారిని 30 నిమిషాలు పాటు డాక్టర్ల ఆధ్వర్యంలో పరిశీలించిన తరువాత ఎటువంటి దుష్ప్రభావాలు లేవని నిర్ధారించుకొని,వ్యాక్సిన్ ధృవీకరణ పత్రం ఇచ్చి పంపించడం జరిగింది.ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వలన గర్భాశయముఖద్వార క్యాన్సర్ రాకుండా రక్షణ కల్పిస్తుందని డాక్టర్ భావన గారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో PHN వెంకటసుబ్బమ్మ, సూపర్ వైజర్ భాస్కర్ రెడ్డి, స్త్రీ ఆరోగ్య కార్యకర్తలు,ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird