Home Uncategorized ఇందుకూరుపేట వెలుగు కార్యాలయం నందు 17 విడత సోషల్ ఆడిట్ ప్రజా వేదిక

ఇందుకూరుపేట వెలుగు కార్యాలయం నందు 17 విడత సోషల్ ఆడిట్ ప్రజా వేదిక

by VRM Media
0 comments

VRM మీడియా ప్రతినిధి అయినవిల్లి భద్రం

దేవిపట్నం మార్చి 12
పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక స్త్రీ శక్తి కార్యాలయం నందు 17వ విడత సోషల్ ఆడిట్ ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా మండల ఎంపీపీ కుంజం మురళి, సర్పంచ్ కారం కృష్ణ, బాబు, ఎంపీడీవో సాల్మన్ రాజు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ ప్రజా వేదిక నందు మండలంలో ఉన్న 14 గ్రామపంచాయతీలలో జరుగు ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేసిన ఉపాధి కార్మికులకు కల్పించిన పని దినాలు వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలో చెల్లించిన అమౌంట్ లు జరిగిన పనులపై నివేదిక సమర్పించి ఉన్నారు దీనిలో భాగంగా వేతనాలు సక్రమంగా అందినాయ లేదా గుర్తించడం జరిగినది అదేవిధంగా మస్టర్ల యందు హాజరులు కొట్టివేతలు గుర్తించి కొలతల వ్యత్యాసం వచ్చిన తేడాలకు సిబ్బందికి కొంత జరిమానా రూపంలో విధించడం జరిగినది ఇకపై జరుగు విధి విధానాన్ని సక్రమంగా ఉండాలని ఆడిట్ సక్రమంగా ఉండాలని ఆదేశించడం జరిగినది
ఈ కార్యక్రమంలో పాడేరు క్లస్టర్ ఏపీడిఆర్ వెంకట్రావు ఎస్ఆర్పి అచ్యుతు, ఏపీవో వి లక్ష్మీనారాయణ రావు, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి అయినాల శ్రీనివాస్, రంపచోడవరం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కోసు అచ్చిబాబు మా గాపు బాబురావు, క్లస్టర్ ఇంచార్జ్ ముచ్చు వీర వెంకట సత్యనారాయణ (చిన్ని )వివిధ గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

2,802 Views

You may also like

Leave a Comment