Home ఎంటర్‌టెయిన్మెంట్ ఎంజీఆర్ వివాదం.. సంచలన వీడియో రిలీజ్ చేసిన రాజేంద్రప్రసాద్! – VRM MEDIA

ఎంజీఆర్ వివాదం.. సంచలన వీడియో రిలీజ్ చేసిన రాజేంద్రప్రసాద్! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


ఇటీవల ఓ కార్యక్రమంలో తమిళ సినీ దిగ్గజం ఎంజీఆర్ పై సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే. నటులు నాజర్, విశాల్ సహా పలువురు దీనిని తప్పుబట్టారు. తాజాగా రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పారు.

రీసెంట్ గా కళాప్రపూర్ణ కత్తి కాంతారావు జాతీయ అవార్డుని రాజేంద్రప్రసాద్ అందుకున్నారు. ఈ సందర్భంగా కాంతారావుపై ప్రశంసలు కురిపించేలా.. ఎంజీఆర్ ని తక్కువ చేసి మాట్లాడారు రాజేంద్రప్రసాద్. కాంతారావుని చూసి అప్పట్లో ఎంజీఆర్ ఉ** పోసుకున్నాడని అన్నారు.

ఎంజీఆర్ పై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తమిళ ప్రజలు, ఎంజీఆర్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నాజర్, విశాల్ ప్రసాద్ సహా పలువురు సినీ ప్రముఖులు రాజేంద్ర తీరుని తప్పుబట్టారు. క్షమాపణలు వెంటనే చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ హామీనే తాజాగా తమిళ భాషలో క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు రాజేంద్రప్రసాద్. తనకు ఎంజీఆర్ అంటే ఎంతో గౌరవమని, ఆయనను తాను స్ఫూర్తిగా తీసుకుంటానని చెప్పారు. అవి ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, ప్రసంగంలో భాగంగా తెలియక చేసిన వ్యాఖ్యలను వివరించారు.

“నా మాటల వల్ల తమిళ సోదరులు, ఎంజీఆర్ అభిమానులు బాధపడితే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను” అని రాజేంద్రప్రసాద్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: జియో హాట్‌స్టార్‌లో విజయ్ సేతుపతి సంచలన వెబ్ సిరీస్

2,801 Views

You may also like

Leave a Comment