vrm media ప్రతినిధి ఖమ్మం



మార్చ్ 13…ఖమ్మం రూరల్.తల్లంపాడు
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మండల పరిషత్ పాఠశాలలు ఆంగ్ల బోధనలో ముందున్నాయని,తల్లంపాడుప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని సర్పంచ్ అంబేద్కర్ అన్నారు.శనివారం ఖమ్మం రూరల్ పరిధి లోని ప్రభుత్వ పాఠశాల తల్లంపాడు లో జరిగిన స్కూల్ డే కమ్ ఫేర్వెల్ పార్టీ వేడుక సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. విద్యార్థుల ఆంగ్ల ఉపన్యాసం అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు.పాఠశాలకు కావలసిన సదుపాయాలను కల్పించే ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. పూర్వ ఉపాధ్యాయులు పీవీ రమణ పంపిణీచేసిన పరీక్ష ప్యాడ్ లను పెన్నులు విద్యార్థులకు అందించారు.సభకు అధ్యక్షత వహించిన పాఠశాల హెచ్ ఎం హైమావతి మాట్లాడుతూ ఎవ్రీ చైల్డ్ రీడింగ్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని.. పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహం అభినందనీయమని అన్నారు. ఉపాధ్యాయులు,కవి, కటుకోఝ్వల రమేష్ సభా సమన్వయం చేశారు. సభ ప్రారంభానికి ముందు విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగలక్ష్మి,రాకేష్, విశ్రాంత ఉపాధ్యాయులు పీవీ రమణ,వార్డు కౌన్సిలర్లు అశోక్,కార్తీక్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.