Vrm media ప్రతినిధి ఖమ్మం
తెలంగాణ జాగృతి అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఖమ్మం లోని జీసస్ అనాధాశ్రమంలో జిల్లా అధ్యక్షురాలు గట్టు కరుణ మరియు ప్రధాన కార్యదర్శి వనం నాగేందర్ ఆధ్వర్యం లోనిర్వహించటం జరిగింది. వెలుగుమట్ల భూ నిర్వాసితుల కోసం పోరాడి విజయం సాధించి, వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రధాన కారణం తెలంగాణ జాగృతి కవితక్కపోరాటమే నని జిల్లా అధ్యక్షురాలు గట్టు కరుణ అన్నారు. ఈ సందర్భంగా కవిత గారి జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు గుంటి సుందర్ , బానోతు కిషన్ నాయక్, జిల్లా బంజారా జాగృతి అధ్యక్షుడు రాజ్ కుమార్ ,
వినోద బాయి షేక్ రఫీ భాగం ఉదయ్ ఆశ్రమ నిర్వాహకురాలు ఎన్ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు

