జగన్మోహన్రాజు కృషితో ఒంటిమిట్ట వయా సర్వీస్ ప్రారంభం
పల్లెల్లో మహిళల కర్పూర హారతులు – రైతులు, విద్యార్థులకు ఉపయుక్తం
ఒంటిమిట్ట, మార్చి 14:
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట
కడప నుంచి దర్జీపల్లి వరకు ఒంటిమిట్ట వయా నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసును శనివారం ఘనంగా పునఃప్రారంభించారు. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ జగన్మోహన్రాజు ప్రత్యేక కృషితో ఈ సర్వీస్ మళ్లీ ప్రారంభమైందని నాయకులు తెలిపారు. ఒంటిమిట్ట సర్కిల్ పరిధిలో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది.
బస్సును అరటి పిలకలు, మామిడి తోరణాలు, బ్యానర్లు, పార్టీ జెండాలతో ప్రత్యేకంగా అలంకరించారు. నాయకులు జెండా ఊపి బస్సును ప్రారంభించగా గ్రామాల్లో మహిళలు పసుపు, కుంకుమలతో కర్పూర హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. పల్లె పల్లెలో మహిళలు సంప్రదాయంగా హారతులు ఇవ్వడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ జగన్మోహన్రాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని అన్నారు. కడప–దర్శిపల్లి మధ్య బస్సు సర్వీస్ పునఃప్రారంభంతో ఒంటిమిట్ట మండలంలోని అనేక గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజూ విద్యాసంస్థలకు వెళ్లేందుకు, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు, మహిళలు పట్టణాలకు వెళ్లేందుకు ఈ బస్సు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న బొబ్బిలి రాయుడు మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు అవసరమైన రవాణా సౌకర్యాలను కల్పించేందుకు జగన్మోహన్రాజు ఎప్పుడూ ముందుండి కృషి చేస్తున్నారని అన్నారు. కడప నుంచి దర్శిపల్లి వరకు ఒంటిమిట్ట వయా బస్సు సర్వీస్ తిరిగి ప్రారంభమవడం వల్ల పలు గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా విద్యార్థులు, రైతులు, మహిళలకు ఈ సర్వీస్ ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజంపేట డిపో మేనేజర్ గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ. వెంకటసుబ్బయ్య (బొబ్బిలి), వెంకటరమణ, ఎంపీపీ ప్రతినిధి సాలాబాద్ బుజ్జి, ఎస్.వి. రమణ, ఎంపీటీసీ భాష, మహిమ్, సర్పంచ్ ప్రతినిధి వెంకటరమణ, శ్రీనివాసరెడ్డి, కే. సుబ్బరాయుడు, డాక్టర్ జిలాని, ఎల్లయ్య యాదవ్, మాజీ సర్పంచ్ నర్సింహులు, లక్ష్మిరెడ్డి, సర్పంచ్ లక్ష్మీనరసయ్య, చంద్రపాల్, చిన్నారి, టీ. ఐవారయ్య, బి. శ్రీనివాసులు, శివారెడ్డి, మస్తాన్, వెంకటయ్య, దిలీప్, జై సింహ రెడ్డి, పల్లె రమణ, రవి, రామ సుబ్బారెడ్డి, శ్రీనివాసులు, నాగార్జున, రోశయ్య, రాజారెడ్డి, నాగరాజా, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird