Home Uncategorized *జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి గారితో భేటీ అయిన శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ *

*జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి గారితో భేటీ అయిన శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ *

by VRM Media
0 comments

VRM media అయినవిల్లి భద్రం

రాజానగరం నియోజకవర్గంలో రహదారులు, తాగునీరు, సాగునీరు, భూసేకరణ వంటి సమస్యలపై తక్షణ చర్యలు కోరుతూ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు అందించానని, సదరు సమస్యల పై ప్రతిపాదనలు వేగవంతం చేయాలని కలెక్టర్ ను కోరిన శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ .

· కొత్తతుంగపాడులో మురుగు కాలువకు అవుట్‌లెట్ కొరకు

· మధురపూడి SASCI రోడ్ల నిర్మాణానికి 72 సెంట్ల భూసేకరణ కొరకు

· కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఇనాం భూముల సమస్య పరిష్కారం కొరకు

· పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణకు పెండింగ్ పరిహారం కొరకు

· కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని TTD దత్తతకు ప్రతిపాదన

· నిలిచిపోయిన NDB రోడ్ల నిర్మాణం వేగవంతం కొరకు

· శ్రీరాంపురం – పోలీస్ క్వార్టర్స్ రహదారి విస్తరణ, అభివృద్ధి కొరకు

· కోరుకొండ దేవస్థానం రహదారి విస్తరణ అభివృద్ధి కొరకు

· సీతానగరం PHC భవనం మరమ్మత్తులకు నిధులు కొరకు

· వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి 6 RWS పనులు కొరకు

· సత్యసాయి తాగునీటి పథకానికి శాశ్వత పరిష్కారం కొరకు

· శ్రీరంగపట్నం బురద కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం కొరకు

· గాడరాడలో పుష్కర కాలువపై వంతెన నిర్మాణం కొరకు

· కనుపూరులో లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మంజూరు కొరకు

· దివాన్ చెరువు పంచాయతీ సమస్యల పరిష్కారం కొరకు

· రాజానగరం – నరేంద్రపురం జంక్షన్ లో ఫ్లై ఓవర్ నిర్మించండి మరియు ట్రాఫిక్ కానిస్టేబుల్ ని ఏర్పాటు చేయండి.

రాజానగరం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ సోమవారం జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి ని బొమ్మూరు కలెక్టర్ కార్యాలయం నందు కలిసి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి మరియు ప్రజా సమస్యలను వినతిపత్రాల రూపంలో సమర్పించారు. ఇప్పటికే తాను ప్రభుత్వ దృష్టికి ఈ సమస్యలు తీసుకొని వెళ్లానని , గ్రామీణ మౌలిక సదుపాయాలు, రహదారులు, తాగునీరు, సాగునీరు, భూసేకరణ, దేవాలయ అభివృద్ధి వంటి అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అందుకోసం ప్రతిపాదనలు ఆయన కోరారు.

👉 కొత్తతుంగపాడు గ్రామపంచాయతీ పరిధిలోని కొత్త రామాలయం సెంటర్ వద్ద సీసీ డ్రెయిన్ నిర్మాణానికి అవుట్‌లెట్ ఏర్పాటు చేయడానికి సుమారు ఒక సెంట్ భూమి అవసరమని ఆయన వివరించారు. ప్రస్తుతం మురుగునీరు నిల్వ ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. అవసరమైన భూమి సేకరణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

👉 మధురపూడి గ్రామంలో SASCI పథకం కింద మంజూరైన గ్రామీణ రహదారుల నిర్మాణానికి అవసరమైన 72 సెంట్ల భూమిని రైతుల నుంచి తక్షణం స్వాధీనం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ రహదారులు పూర్తయితే రైతులకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు డ్రైనేజ్ సమస్యలు కూడా పరిష్కారమవుతాయని తెలిపారు.

👉 కోరుకొండ గ్రామంలో అనేక భూములు 22A(1)C కింద దేవాదాయ శాఖ పేరుతో నమోదవడంతో రైతులు భూముల క్రయవిక్రయాలు, బ్యాంకు రుణాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. ఈ సమస్యకు తగిన పరిష్కారం చూపాలని కోరారు.

👉 పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఎనిమిది సంవత్సరాలుగా నష్టపరిహారం అందలేదని ఆయన తెలిపారు. రైతులకు ఎకరాకు నిర్ణయించిన పరిహారం ఆరు శాతం వడ్డీతో వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

👉 కోరుకొండలోని ప్రాచీన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. రాబోయే గోదావరి పుష్కరాల దృష్ట్యా భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

👉 రాజానగరం నియోజకవర్గంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో చేపట్టిన మూడు రహదారి పనులు ఆలస్యంగా సాగుతున్నాయని, పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేసి పనులను వేగవంతం చేయాలని కోరారు.

👉 శ్రీరాంపురం నుండి పోలీస్ క్వార్టర్స్ వరకు 5.2 కిలోమీటర్ల రహదారిని డబుల్ లేన్‌గా విస్తరించేందుకు రూ.6.50 కోట్ల అంచనాతో ప్రతిపాదన సమర్పించినట్లు తెలిపారు. అలాగే కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వెళ్లే రహదారిని రూ.3.60 కోట్లతో విస్తరించి బలోపేతం చేయాలని కోరారు.

👉 సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం దెబ్బతిన్నందున రూ.27.50 లక్షలతో మరమ్మత్తులు చేపట్టాలని కోరారు.

👉 వేసవిలో తాగునీటి సమస్యను నివారించేందుకు కొరుకొండ, వెలుగుబంద, చక్రద్వారబంధం, ఫరిజేల్లిపేట, కునవరం ప్రాంతాల్లో ఆరు అత్యవసర తాగునీటి పనులు చేపట్టాలని సూచించారు.

👉 పురుషోత్తపట్నం వద్ద ఉన్న శ్రీ సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణలో సమస్యలు ఉన్నందున రూ.10 కోట్లతో ప్రత్యేక మరమ్మత్తులు చేపట్టాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

👉 కోరుకొండ, సీతానగరం మండలాల్లో వరదల వల్ల తరచూ నష్టాలు జరుగుతున్నందున శ్రీరంగపట్నం ప్రాంతంలోని బురద కాలువకు శాశ్వత రక్షణ పనులు చేపట్టాలని కోరారు.

👉 గాదరాడ గ్రామంలో పోలవరం ఎడమ ప్రధాన కాలువపై రోడ్ బ్రిడ్జి నిర్మించాలని, కనుపూరు గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.

👉 దివాన్ చెరువు గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, రహదారులు, మురుగు కాలువలు వంటి సమస్యలను పరిష్కరించేందుకు రూ.1.27 కోట్లతో 24 మౌలిక సదుపాయాల పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

👉 నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజల సౌకర్యాల దృష్ట్యా పై సమస్యలను అత్యవసరంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జిల్లా కలెక్టర్‌ను కోరారు.

👉 నరేంద్రపురం–రాజానగరం జంక్షన్ వద్ద పెరుగుతున్న ప్రమాదాలు – తక్షణమే 24 గంటల ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి.

👉 జాతీయ రహదారిపై ఉన్న నరేంద్రపురం – రాజానగరం జంక్షన్ ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన ‘బ్లాక్ స్పాట్‌’గా మారింది. ఇక్కడ నిత్యం లారీలు, బస్సులు, కార్లు, వ్యవసాయ వాహనాలు మరియు ద్విచక్ర వాహనాల రాకపోకలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజల సంచారం విపరీతంగా ఉంటుంది. ఇంతటి రద్దీ ఉన్నప్పటికీ, ఇక్కడ సరైన ట్రాఫిక్ నియంత్రణ, హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు లేకపోవడం వల్ల వరుస ప్రమాదాలు సంభవిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోంది.

👉 NH-216 పరిధిలోని ఈ జంక్షన్ వద్ద గత నాలుగేళ్లలో నమోదైన ప్రమాద గణాంకాలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. 2023లో 03 మరణాలు సహా మొత్తం 05 ప్రమాదాలు, 2024లో 06 మరణాలతో మొత్తం 08 ప్రమాదాలు, 2025లో 03 మరణాలతో మొత్తం 09 ప్రమాదాలు జరిగాయి. ఇక ప్రస్తుత 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 3వ తేదీ నాటికే ఒక ప్రాణాంతక ప్రమాదం నమోదైంది. గత నాలుగేళ్లలో ఇక్కడ మొత్తం 23 ప్రమాదాలు జరగ్గా, అందులో 13 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత ఆందోళనకరం.

👉 ముఖ్యంగా రాత్రి వేళల్లో ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడంతో మితిమీరిన వేగం, అస్తవ్యస్తమైన క్రాసింగ్‌ల వల్ల నిత్యం భయాందోళనలు నెలకొంటున్నాయి. సరైన సైన్ బోర్డులు మరియు పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ జంక్షన్ మృత్యుకూడలిగా మారుతోంది. తదుపరి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు మరియు ప్రయాణికులు కోరుతున్నారు.

👉 కావున, నరేంద్రపురం–రాజానగరం జంక్షన్ వద్ద 24 గంటల పాటు ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను నియమించాలని మరియు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఒక చిన్న నివారణ చర్య ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చు మరియు ట్రాఫిక్ క్రమశిక్షణను మెరుగుపరచవచ్చు. ఈ విషయాన్ని అత్యంత అత్యవసరమైనదిగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. అలాగే అక్కడ పై వంతెన నిర్మాణ ఆవశ్యకత ఉందని ఆయన తెలిపారు..

పై విషయాలపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ కీర్తి చేకూరి త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తానని, నిధులు విడుదల చేస్తామని తెలియజేసారు.

2,806 Views

You may also like

Leave a Comment