" రైతన్న మీకోసం - ఇంటింటికి " కార్యక్రమానికి హాజరైన చమర్తి జగన్ మోహన్ రాజు
VRM న్యూస్ బాల మౌలాలి మార్చి 17
రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రైతులకు అవసరమైన చర్యలు చేపడుతుందని నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు.
మంగళవారం నాడు ఒంటిమిట్ట మండలం,గొల్లపల్లె గ్రామం,దర్జీ పల్లె నందు నందు పర్యటిస్తూ "అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ " రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా రైతుల ఇండ్ల వద్దకే వెళ్లి చమర్తి జగన్ మోహన్ రాజు రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ రైతన్నలకు అన్నదాత సుఖీభవ నిధులు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
అంతేకాకుండా ప్రస్తుతం రైతులు చేపడుతున్న వ్యవసాయ పనులపై కూడా జగన్ మోహన్ రాజు గారు ఆరా తీశారు.
అనంతరం పొలాల్లో వ్యవసాయం చేస్తున్న రైతులతో చమర్తి మాట్లాడి స్థానిక నాయకులతో కలిసి కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి. జడ్పిటిసి ముద్దుకృష్ణ రెడ్డి. క్లాస్ 1 ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్వీ రమణ. టిడిపి సీనియర్ నాయకులు బొబ్బిలి రాయుడు. టిడిపి ప్రధాన కార్యదర్శి ఆలూరు వెంకటసుబ్బయ్య. క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మగుంట్ల ఈశ్వరయ్య. గ్రామ కమిటీ అధ్యక్షుడు పత్తి సుబ్బరాయుడు. అగ్రికల్చర్ ఏవో మంజులరాణి. టిడిపి సీనియర్ నాయకుడుసా లా బాద్ బుజ్జి. గజ్జలశ్రీనివాసులు రెడ్డి. యూనిట్ ఇంచార్జి చంద్రపాల్. టిడిపి సీనియర్ నాయకులు శివారెడ్డి. సర్పంచ్ బి లక్ష్మీ నరసయ్య. చెల్లా రోశయ్య. టిడిపి సీనియర్ నాయకులు లక్ష్మీరెడ్డి. టిడిపి సీనియర్ నాయకులు మౌలాలి. వెంకటసుబ్బయ్య . గొల్లపల్లి మాజీ సర్పంచ్ ఒంటిమిట్టకు చెందిన పలువురు పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు అభిమానులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird