Home Uncategorized రాజానగరం హై స్కూల్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ .

రాజానగరం హై స్కూల్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ .

by VRM Media
0 comments

VRM media అయినవిల్లి భద్రం

మధ్యాహ్న భోజన పధకంలో విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యతపై అడిగి తెలుసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు , ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ , విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ ఆదేశానుసారం రాజానగరం హై స్కూల్ నందు ఆకస్మిక తనిఖీ చేసిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ .

ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ మధ్యాహ్న భోజనం పధకంలో వారికి అందుతున్న భోజనం యొక్క నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రతీ విషయం క్షుణ్ణంగా అర్థమయ్యేలా ఉపాధ్యాయులు అనుసరిస్తున్న బోధనా పద్దతులను కొనియాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి కూర్చుని భోజనం నాణ్యత తెలుసుకుంటూ వారితో కలిసి భోజనం చేసారు. విద్యార్థులకు మంచి భోజనం అందజేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేసారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమకు తెలియజేయాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

2,803 Views

You may also like

Leave a Comment