Home ఎంటర్‌టెయిన్మెంట్ మంగ్లీపై కేసు నమోదు చేసిన ముంబై లాయర్ వినీత్ జిందాల్.. రీజన్ తెలిస్తే షాక్ – VRM MEDIA

మంగ్లీపై కేసు నమోదు చేసిన ముంబై లాయర్ వినీత్ జిందాల్.. రీజన్ తెలిస్తే షాక్ – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo



-కేసు నమోదు చేయడానికి కారణం ఏంటి!
-మంగ్లీ ఏం చేసింది
-పూర్తి వివరాలు ఇవే

పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై చాలా బలంగా తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు కన్నడ హీరో ధ్రువ సర్జా(దృవ సర్జా). ఈ మేరకు జననాయకన్, టాక్సిక్ ఫేమ్ కే విఎన్ ప్రొడక్షన్స్ లో విడుదలైన ‘కెడి: ది డెవిల్'(kd The Devil)అనే మూవీతో శరవేగంగా ముస్తాబవుతున్నాడు. నిజానికి ఈ మూవీ మూడు సంవత్సరాల క్రితమే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు అవాంతరాలు ఎదురవ్వడంతో డిలే అవుతూ వస్తుంది. ఇప్పుడు ఈ మూవీ ఒక సాంగ్ విషయంలో వైరల్ గా మారింది.

రీసెంట్ గా కెడి నుంచి ‘సర్కే చునర్'(sarke Chunar)అనే సాంగ్ పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో రిలీజ్ అయ్యింది. సదర్ సాంగ్ లో నోరా ఫతేహి, సంజయ్ దత్ చేయగా రకీబ్ ఆలం సాంగ్ ని రచించాడు. హిందీ వెర్షన్ ని మన తెలుగు సింగర్ మంగ్లీ అలపించింది. ఇప్పుడు ఈ సాంగ్ పై సోషల్ మీడియా వేదికగా నెటిజెన్స్ స్పందిస్తూ హిందీ వెర్షన్ లిరిక్స్‌లో శృంగారాన్ని వర్ణిస్తూ వాడిన పదజాలం అత్యంత అసభ్యకరంగా, ద్వందార్థాలతో ఉంది. దృశ్యపరంగా కూడా అశ్లీలత హద్దులు దాటింది. జానపదాలు, భక్తి గీతాలకి పేరుగాంచిన మంగ్లీ ఇలాంటి ‘బూతు’ కంటెంట్ ఉన్న సాంగ్ ని ఎలా పాడిందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే హిందీ సాహిత్యంతో ప్రస్తుత తెలుగు సాహిత్యం కొంత మర్యాదపూర్వకంగానే ఉందనే కామెంట్స్ చేస్తున్నారు.

కూడా చదవండి: ధురంధర్ 2: రిలీజ్ కి ముంచే రికార్డు కలెక్షన్స్ సాధించిన ధురంధర్ 2 ..అడ్వాన్స్ ఫిగర్ ఇదే

ముంబైకి చెందిన లాయర్ వినీత్ జిందాల్ అయితే ‘సర్కే చునర్’ సాంగ్ లోని సాహిత్యం, దృశ్యాలు సమాజంపై, ముఖ్యంగా చిన్నపిల్లలపై ప్రతికూల ప్రభావం చూపు సెన్సార్ బోర్డు (CBFC), కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకి ఫిర్యాదు చేశారు. తన అర్జున్ ఫిర్యాదులో దర్శకుడు ప్రేమ్, సంగీత దర్శకుడు జన్య, రచయిత రకీబ్, గాయని మంగ్లీ పేర్లను ప్రస్తావించారు. ఇక తీవ్ర వ్యతిరేకత వస్త నిర్మాణ చిత్ర యూనిట్ సాంగ్ ని యూట్యూబ్ నుంచి తొలగించినట్లు సమాచారం.

2,802 Views

You may also like

Leave a Comment