Home ఎంటర్‌టెయిన్మెంట్ ఆస్కార్ వేదికపై రాజకీయ ప్రకంపనలు.. యుద్ధానికి వ్యతిరేఖంగా వ్యాఖ్య – VRM MEDIA

ఆస్కార్ వేదికపై రాజకీయ ప్రకంపనలు.. యుద్ధానికి వ్యతిరేఖంగా వ్యాఖ్య – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


– పాలస్తీనాకు మద్దతు తెలిపిన జేవియర్ బార్డెం

– ప్రియాంక చోప్రా రియాక్షన్ వైరల్!

– ఆస్కార్ వేదికపై రాజకీయ ప్రకంపనలు

ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల వేదిక ఈసారి కేవలం అవార్డులకే పరిమితం కాలేదు. హాలీవుడ్ ప్రముఖ నటుడు జేవియర్ బార్డెమ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. గ్లోబల్ వేదికపై ఆయన యుద్ధానికి వ్యతిరేకంగా గళం ఎత్తడమే కాకుండా, ‘ఫ్రీ పాలస్తీనా’ అంటూ చేసిన నినాదం పెను దుమారాన్ని రేపుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. 98వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఉత్తమ అంతర్జాతీయ చిత్ర అవార్డును ప్రదానం చేసేందుకు జేవియర్ బార్డెమ్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కలిసి వేదికపైకి వచ్చారు. ఈ సందర్భంగా బార్డెమ్ మైక్ అందుకు నేరుగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందించారు. “యుద్ధం వద్దు.. పాలస్తీనాకు స్వేచ్ఛ కావాలి” అంటూ ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

జేవియర్ బార్డెమ్ కేవలం మాటలతోనే కాకుండా తన దుస్తులపై ధరించిన బ్యాడ్జీల ద్వారా కూడా తన నిరసనను తెలియజేశారు. ఆయన సూట్‌పై యుద్ధం వద్దు అని రాసి ఉన్న రెడ్ పిన్‌తో పాటు పాలస్తీనాకు మద్దతుగా ఉన్న చిహ్నాన్ని ధరించారు. 2003లో ఇరాక్ యుద్ధం సమయంలో కూడా ఆయన ఇదే తరహాలో నిరసన వ్యక్తం చేయడం.

ఈ పరిణామం వేదికపై ఉన్న ప్రియాంక చోప్రాను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. బార్డెమ్ అంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఆమె చిరునవ్వుతో తల ఊపుతూ కనిపించింది. అయితే సోషల్ మీడియాలో నెటిజన్లు కనిపిస్తున్నారు. యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక, అటువంటి గంభీరమైన ప్రకటన సమయంలో మరింత స్పష్టంగా స్పందించాల్సి ఉందని కొందరు విమర్శిస్తుంటే, ఆమె పరిస్థితిని హుందాగా హ్యాండిల్ చేసిందని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు.

నటుడిగా జేవియర్ బార్డెమ్ కి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ‘నో కాంట్రీ ఫర్ ఓల్డ్ మెన్’, ‘స్కైఫాల్’ వంటి చిత్రాలలో తన అద్భుత నటనతో ఆకట్టుకున్న ఆయన, సామాజిక సమస్యలపై ఎప్పుడూ ముందుంటారు. ఈ ఏడాది ఆస్కార్ వేదికపై ఆయన ప్రసంగం తర్వాత, అవార్డు అందుకున్న ‘సెంటిమెంటల్ వాల్యూ’ చిత్ర దర్శకుడు జోచిమ్ ట్రియర్ కూడా యుద్ధ పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేస్తూ రాజకీయ నాయకుల బాధ్యతను గుర్తు చేశారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో జేవీయర్ బార్డెమ్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఆస్కార్ వంటి అంతర్జాతీయ వేదికను ఇలాంటి రాజకీయ నిరసనలకు వేదికగా మార్చడంపై అకాడమీ ఎలా నమోదైందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది

2,801 Views

You may also like

Leave a Comment