

-రేపు ప్రీమియర్స్ నుంచే సిల్వర్ స్క్రీన్ పైకి
-అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఎంత వచ్చాయి
-సరికొత్త రికార్డు అంటారా
ఇండియా వైడ్ గా మీ ఇష్టమొచ్చిన ఏరియాకి వెళ్లి మూవీ లవర్స్ ని కదిలించండి. మీరు అడక్కుండానే వాళ్ళు మీతో ‘ఏది ఏమైనా ‘ధురంధర్ పార్ట్ 2(ధురంధర్ 2)’సాధించింది మాములు రికార్డు కాదు. రిలీజ్ కి ముందే ఇలా ఉంటే రిలీజ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో. పై పెచ్చు పార్ట్ 1 కి వచ్చినట్టు హిట్ టాక్ వస్తే ఇండియన్ సినీ ఖజానాలో మూలగబోయే సంపద ఊహించుకోబోతుంటేనే సినీ పులకరింత కలిగిస్తుందని అంటారు. ఆ తర్వాత నిజం తెలిసాక మనం కూడా అవే డైలాగ్స్ తో ధురంధర్ 2 రికార్డుల ప్రచార కర్తగా బాధ్యతలు తీసుకుంటాం. మరి ఆ మ్యాటర్ ఏంటో చూద్దాం.
ధురంధర్ 2 వరల్డ్ వైడ్ గా రేపు సాయంత్రం ఐదు గంటల ప్రీమియర్స్ నుంచే సందడి చేయనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బుకింగ్స్ కూడా సుమారు వారం రోజుల క్రితమే స్టార్ట్ అయ్యాయి. దీనితో అడ్వాన్స్ బుకింగ్స్ కి సంబంధించి 135 కోట్ల మార్కుని దాటేసింది. ఇది మాములు రికార్డు కాదు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ లో 135 కోట్ల మార్కుని అందుకున్న ఫస్ట్ మూవీ ధురంధర్ 2 అని చెప్పవచ్చు.
కూడా చదవండి: రజినీకాంత్: భయపడ్డానా!.. టివికె పార్టీకి కౌంటర్ ఇస్తూ లెటర్ రిలీజ్ చేసిన రజినీ
ఇక పార్ట్ 2 ట్రైలర్ దగ్గర నుంచి మూవీపై అంచనాలు అంబరాన్ని అంటాయి. రెహ్మాన్ డెకాయిట్ చనిపోయి ఉండటంతో పార్ట్ 2 కథ, కథనం ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అందరిలోనూ ఉంది. రణవీర్ సింగ్(Ranveersingh)సారా అర్జున్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ ఇలా డైరెక్టర్ చెప్పుకుంటూ పోతుంటే ఆదిత్య ధర్(Aditya Dhar)కదా అని కొంచం ఎగతాళిగా మాట్లాడతారు.అంతలా ధురంధర్ తో ట్రావెల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ‘ధురంధర్ 2’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.