Home Uncategorized 10 నెలలుగా వేతనం లేక ఇబ్బందులు పడుతున్న CRP – అధికారుల నిర్లక్ష్యంపై ఆవేదన

10 నెలలుగా వేతనం లేక ఇబ్బందులు పడుతున్న CRP – అధికారుల నిర్లక్ష్యంపై ఆవేదన

by VRM Media
0 comments



VRM మీడియా న్యూస్
సత్తుపల్లి ప్రతినిధి | ఖమ్మం జిల్లా | 18-03-2026

పెనుబల్లి మండలం పరిధిలో ZPSS కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న CRP శీలం గోపాలకృష్ణ గత సంవత్సరం జూన్ 2025 నుండి విధుల్లో చేరినప్పటికీ, ఇప్పటి వరకు వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముగ్గురు కుమార్తెలతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారిందని, రోజువారీ ఖర్చులు కూడా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యమే తన వేతనాలు నిలిచిపోవడానికి కారణమని ఆరోపించారు.

ఈ విషయమై ఖమ్మం DEO కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించగా, అక్కడి సిబ్బంది హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి పేరోల్ ఐడీ అప్రూవల్ చేయించుకోవాలని సూచించినట్లు చెప్పారు. వారి సూచన మేరకు హైదరాబాద్‌లోని రాష్ట్ర SPD కార్యాలయం మరియు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాలను సంప్రదించి వినతిపత్రాలు సమర్పించినట్లు వెల్లడించారు.

జూన్ 2025 నుండి రావలసిన వేతనాలను తక్షణమే మంజూరు చేసి, తన పేరోల్ ఐడీని అప్రూవ్ చేయాలని సంబంధిత అధికారులను శీలం గోపాలకృష్ణ కోరుతున్నారు.

2,811 Views

You may also like

Leave a Comment