[ad_1]

ఇటీవలి కాలంలో సినిమాలకు సంబంధించి జరిగే ఈవెంట్లలో రకరకాల వివాదాలు, వివాదస్పద వ్యాఖ్యలు సెలబ్రిటీల నుంచి వింటున్నాం. వారికి సంబంధించి ఏ చిన్న క్లిప్పింగ్ బయటికి వచ్చినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల జరిగిన ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్లో శ్రీలీల, నటుడు మహేష్‌కి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతున్న విషయం. దీనికి సంబంధించిన మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు శ్రీలీల వివరణ ఇచ్చారు.
నేను ఈవెంట్లో ఉన్నపుడు వెనుక నుంచి ఏదో సౌండ్ వినిపించింది. అందుకే వెనక్కి తిరిగి చూశాను. నా ఫోన్ మహేశ్‌గారి దగ్గర ఉంది. నేను స్టేజ్ ఎక్కుతున్నప్పుడు ఆయన నా ఫోన్ పట్టుకుని నాకు హెల్ప్ చేశారు. నేను కేవలం నా ఫోన్ కోసమే వెనక్కి తిరిగాను తప్ప, ఆయనను వేరే ఉద్దేశంతో చూడలేదు. సోషల్ మీడియాలో వచ్చే చిన్న చిన్న క్లిప్పింగ్స్‌ను చూసి ఎవరినీ తప్పుగా అంచనా వేయకండి. అక్కడ ఏదో సీరియస్ స్పీచ్ జరుగుతాను నేను కూడా చాలా కాన్సంట్రేటెడ్‌గా ఉన్నాను. నా గురించి వచ్చే 'అహంకారం', 'మిస్ బిహేవియర్' అనే పెద్ద పెద్ద మాటలు వింటే చాలా బాధగా అనిపించింది. నేను ఏదైనా చెప్పాలనుకుంటే అందరి ముందు ధైర్యంగా చెప్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే వీడియోలు అప్పుడప్పుడు అపార్థాలకు దారితీస్తాయి. మేము స్వయంగా నోటితో చెప్పే వరకు దేన్నీ నమ్మకండి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లాప్పింగ్ గురించి క్లారిటీ ఇచ్చారు శ్రీలీల.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird