Home Uncategorized కోయ ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్ లో ఐదో వ తరగతి విద్యార్థి ,నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫైనల్ రిజల్ట్ లో 100 కి 83.75 మార్క్స్ తో ఓవరాల్ గా 98 ర్యాంక్ తో ముర్రం ప్రణతి సాయిశ్రీ విద్యార్థి.

కోయ ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్ లో ఐదో వ తరగతి విద్యార్థి ,నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫైనల్ రిజల్ట్ లో 100 కి 83.75 మార్క్స్ తో ఓవరాల్ గా 98 ర్యాంక్ తో ముర్రం ప్రణతి సాయిశ్రీ విద్యార్థి.

by VRM Media
0 comments

విఆర్ఎమ్ ప్రతినిధి అయినవిల్లి భద్రం

పోలవరం జిల్లా దేవీపట్నం మండలం చిన్న రమణయ్యపేట, ఆర్ అండ్ ఆర్ కాలనీ, కమలం పాలెం కు సంబంధించిన కోయ ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్ లో చదువుతున్నటువంటి ఐదోవ తరగతి విద్యార్థిని ముర్రం ప్రణతి సాయిశ్రీ నీ నవోదయ ఎంట్రన్స్ టెస్ట్ రాయించడం జరిగింది. ఎగ్జామ్స్ ఫైనల్ రిజల్ట్ లో 100 కి 83.75 మార్క్స్ తో ఓవరాల్ గా 98 ర్యాంక్ తో దేవీపట్నం మండలం మొత్తంలో నవోదయాలో సీటు రావడం జరిగింది.. నవోదయ కి సంబంధించి మాకు సహకరించిన దేవీపట్నం మండలం ఎంఈఓ త్రిమూర్తులు, ఎంఈఓ 2 అయినటువంటి, బాలు దొర వాళ్ళ సూచనల మేరకు వాళ్ల అందించిన సహకారంతో అలాగే స్కూల్ చైర్మన్ ,వైస్ చైర్మన్ ఇక్కడున్నటువంటి నాలుగు గ్రామాల ముఖ్యమైన యూత్ పర్సన్స్ ,స్కూలు యాజమాన్యం వారి సహకారంతో ఈ విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా కోయ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల 1952లో ఏర్పడి గవర్నమెంట్ వారి సహకారంతో ఇప్పుడు వరకు సేవలందిస్తూ ఇక్కడ చదువుకున్నటువంటి చాలామందినీ టీచర్స్ గాను ఇంజనీర్స్ గాను రకరకాల డిపార్ట్మెంట్స్ లో ఉద్యోగాలు చేయడానికి పునాది వేయడం జరిగింది.. ఇంకా ఇలాంటివి ఎన్నో విజయాలు రావాలని స్కూల్ యాజమాన్యం వారు కోరుకుంటున్నారు.. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు నవోదయాలో విన్నర్ అయినటువంటి ముర్రం ప్రణతి సాయి శ్రీ నీ స్కూల్ యాజమాన్యం వారు అలాగే ఎస్ ఎంసి చైర్మన్ ch శంకర్ దొర , స్కూలు HMమైనటువంటి కరిబండి రాజు మాస్టర్ అలాగే తోటి ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించడం జరిగింది. నవోదయాలో విన్నర్ అయినటువంటి ప్రణతి సాయిశ్రీ ఇలాంటి విజయాలు ఎన్నో పొంది ఆ విద్యార్థిని అనుకున్న లక్ష్యం ,గోల్ అనుకున్న విధంగా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

2,802 Views

You may also like

Leave a Comment