Home ఎంటర్‌టెయిన్మెంట్ వివాదాల నుంచి జాతీయ అవార్డుల వరకు.. ఒక ‘బందిపోటు రాణి’ సంచలన ప్రయాణం! – VRM MEDIA

వివాదాల నుంచి జాతీయ అవార్డుల వరకు.. ఒక ‘బందిపోటు రాణి’ సంచలన ప్రయాణం! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo



– 17 నిమిషాల రేప్ సీన్‌తో ప్రకంపనలు..

– భారతీయ సినిమా షేక్ చేసిన ‘బండిట్ క్వీన్’

– నిషేధం విధించినా తగ్గేదెలే..

– బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన శేఖర్ కపూర్ మూవీ!

భారతీయ సినీ చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, సమాజంలో పెద్ద ఎత్తున చర్చను కూడా లేవనెత్తుతాయి. అటువంటి చిత్రాలలో అగ్రస్థానంలో నిలుస్తుంది ‘బండిట్ క్వీన్’. వాస్తవ గాధల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, అప్పట్లో ఎదుర్కొన్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. కానీ అన్ని అడ్డంకులను దాటుకుని ఈ సినిమా సాధించిన విజయం నేటికీ ఒక అద్భుతమనే చెప్పాలి.

బందిపోటుగా పేరుగాంచిన ఫూలన్ దేవి జీవిత కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ ఈరాణి అద్భుతంగా ఆవిష్కరించారు. 1994లోనే సిద్ధమైన ఈ సినిమాలో దాదాపు 17 నిమిషాల పాటు సాగే అత్యంత దారుణమైన అత్యాచార సన్నివేశాలు సెన్సార్ బోర్డ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ సినిమాపై అప్పట్లో నిషేధం కూడా విధించారు.

ముఖ్యంగా ఈ చిత్రంలో హింస, నగ్నత్వం మోతాదుకు మించి ఉన్నాయననే ఆరోపణలు వచ్చాయి. సాక్షాత్తు ఫూలన్ దేవి కూడా ఈ సినిమా విడుదలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒకానొక దశలో ఈ చిత్రం విడుదల కాదని అందరూ భావించారు. అయితే, ఎట్టకేలకు కొన్ని కట్స్ తర్వాత 1996లో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

ఈ సినిమాలో ఫూలన్ దేవి పాత్రలో సీమ బిశ్వాస్ పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి. ఆమె నటనకు ఫిదా అయిన జ్యూరీ, ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందించారు. అలాగే ఈ చిత్రం ఉత్తమ హిందీ చిత్రంగా కూడా నేషనల్ అవార్డును కైవసం చేసుకుంది. అప్పట్లో మహిళల కోసం ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించడం ఈ సినిమా సాధించిన మరో అరుదైన ఘనత.

ప్రస్తుతం ఈ సినిమా మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సెన్సేషనల్ మూవీ ఇప్పుడు యూట్యూబ్‌లో ఉచితంగా అందుబాటులో ఉండటంతో నెటిజన్లు ఆనాటి సినిమా క్వాలిటీని, శేఖర్ కపూర్ దర్శకత్వ ప్రతిభను కొనియాడుతున్నారు. అప్పట్లో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, నేడు ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ల్యాండ్ మార్క్ మూవీగా మిగిలిపోయింది.

ఓటీటీ వేదికలైన అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. బోల్డ్ కంటెంట్ మరియు రా ఎమోషన్స్ చూడాలనుకునే వారు ఈ క్లాసిక్ మూవీని మిస్ అవ్వకండి. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని బయోపిక్స్‌పై చిత్ర పరిశ్రమలో ఆసక్తి పెరుగుతోంది.

2,801 Views

You may also like

Leave a Comment