vrm media ప్రతినిధి ఖమ్మం


ఖమ్మం మార్చ్ 18,2026:– బుధవారం నాడు స్థానిక సారథి నగర్ మసీదు నందు
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు త్రీ టౌన్ ముస్లిం ప్రజలకు భారీ ఎత్తున ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ యువ నాయకుడు తుమ్మల యుగంధర్ మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖమ్మం కార్పొరేషన్ నాగండ్ల దీపక్ చౌదరి, నాళ్ళ సతీష్, బాణాల లక్ష్మణ్, కన్నం కృష్ణ, దానాల రమణ, పత్తి శీను,ప్రార్థనలో పాల్గొని ఇఫ్తార్ విందు ప్రారంభించి ఈ సందర్భంగా యువ నాయకుడు తుమ్మల యుగంధర్ నాగండ్ల దీపక్ చౌదరి మాట్లాడుతూ ముస్లిం సోదరులను ఉద్దేశించి హిందూ ముస్లింలందరూ సోదర సోదరీమణుల లాగా కలిసిమెలిసి ఉండాలని కులమతాలకు అతీతంగా అందరూ సమానంగా బెధాభిప్రాయాలు లేకుండా సమాజంలో పరస్పర సహకారంతో ఉండాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ముందుగా రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముస్లిం ప్రజలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసినారు కార్యక్రమాలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈ హనుమంతరావు వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ మార్కెట్ డైరెక్టర్ లతీఫ్ నజీర్ బోజట్ల సత్యనారాయణ, ఆసిఫ్ శశిముద్దీన్ బెల్లంకొండ వాసు దొబ్బల సురేష్ బుడిగం వెంకట్రావు దొబ్బల సౌజన్య ఎస్ కే జహీర్ వారా వారశివ శాసనాల తరుణ్ సారంగపాణి మరియుముస్లిం పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు