VRM media అయినవిల్లి భద్రం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో జె.కె. గార్డెన్స్‌లో నిర్వహించిన "ఉగాది పురస్కార మహోత్సవం" పంచాంగ ప్రవచన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల…
ఈ వేడుకల్లో రాజానగరం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ సతీమణి జనసేన పార్టీ నాసేన కోసం నావంతు కమిటీ రాష్ట్ర కో ఆర్డినేటర్ బత్తుల వెంకట లక్ష్మి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహించిన పంచాంగ శ్రవణం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించిన ఈ సభలో పలువురు ప్రముఖులకు ఉగాది పురస్కారాలను అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీమతి బత్తుల వెంకట లక్ష్మి మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి ఉత్సవాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త ఏడాది అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు.
అలాగే ఈ కార్యక్రమానికి తమని ప్రత్యేకంగా ఆహ్వానించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం శాసన సభ్యులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird