Home ఎంటర్‌టెయిన్మెంట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చూసి హరీష్ శంకర్ కి ఫోన్ చేసిన పవన్ ఫ్యాన్స్! – VRM MEDIA

‘ఉస్తాద్ భగత్ సింగ్’ చూసి హరీష్ శంకర్ కి ఫోన్ చేసిన పవన్ ఫ్యాన్స్! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


పవర్ స్టార్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ పవన్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(ఉస్తాద్ భగత్ సింగ్) సినిమా ఉగాది కానుకగా నేడు(మార్చి 19) థియేటర్లలో అడుగుపెట్టింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్.. పరవాలేదు అనే టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ మెచ్చేలా ఈ సినిమాని హరీష్ శంకర్ తెరకెక్కించాడని టాక్ వచ్చింది.

వింటేజ్ పవర్ స్టార్ ని స్క్రీన్ మీద చూశామంటూ ఎందరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఇక ‘తొలిప్రేమ’ సినిమాలోని ‘ఈ మనసే’ సాంగ్ ను సెకండ్ హాఫ్ లో ఉపయోగించడం ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ అనిపించింది. యూఎస్ లో ఉంటున్న ఓ పవన్ అభిమాని.. సినిమా చూసి హరీష్ శంకర్ కి ఫోన్ చేసి.. ఈ సాంగ్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అవ్వడం విశేషం.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ టీమ్ తాజాగా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “ఓ అబ్బాయి ఫోన్ చేసి.. ఎప్పుడు తొలిప్రేమ అన్నా.. టచ్ చేశావన్నా. అమెరికా నుంచి అర్జెంటుగా హైదరాబాద్ వచ్చి మళ్లీ థియేటర్లలో సినిమా చూడాలని ఉందన్నా అంటూ ఎమోషనల్ అయిపోయాడు” అని హరీష్ తెలిపాడు.

మరికొందరు ఫ్యాన్స్ చేసిన మెసేజ్ ల గురించి కూడా హరీష్ చెప్పాడు. చైల్డ్ ఎపిసోడ్ కే ఫిదా అయిపోయి.. ఆ చిన్నబ్బాయిని చూస్తుంటే హీరోని చూస్తున్నట్టే ఉందన్నా అని ఒక ఫ్యాన్స్ మెసేజ్ పెట్టారని హరీష్ తెలిపాడు. దానర్థం ఫస్ట్ హాఫ్ బాలేదని, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ బాగుందని హరీష్ చెప్పుకొచ్చాడు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి హరీష్ శంకర్ కి వస్తున్న ఫోన్లు, మెసేజ్ లు చూస్తుంటే.. ఫ్యాన్స్ కి ఉస్తాద్ భగత్ సింగ్ బాగా నచ్చిందని అర్థమవుతోంది.

ఇది కూడా చదవండి: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ రివ్యూ

2,801 Views

You may also like

Leave a Comment