VRM media అయినవిల్లి భద్రం పల్లె పండుగ 2.0
గత 20 ఏళ్లుగా తీరని డ్రైనేజీ సమస్యకు నేడు విముక్తి
ఆనంద భాష్పాలతో హర్షం వ్యక్తం చేసిన మహిళలు, ప్రజలు
రాజానగరం మండలం, పాత తుంగపాడు గ్రామంలో పల్లె పండుగ 2.0 , మన ఊరు…మన ఎమ్మెల్యే…మన పల్లె బాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటిస్తూ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.. గ్రామంలో ముఖ్యంగా గత 20 ఏళ్లుగా తీరని సమస్యగా ఉన్నటువంటి డ్రైనేజీ సమస్య గురించి తెలుసుకుని పరిష్కారం చూపించడం జరిగింది. రాబోయే వేసవి కాలంలో విద్యుత్ కోతలు లేకుండా 24/7 విద్యుత్ అందించేలా గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ , విద్యుత్ స్థంబాలు, వీధి లైట్లు, మంచి నీటి కుళాయిలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో ఎంతో మంది నాయకులకు మొరపెట్టుకున్నా, పదే పదే విన్నవించినా పాత ప్రభుత్వం ఈ డ్రైనేజీ సమస్యను పూర్తిగా గాలికొదిలేసింది. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా కాలయాపన చేయడంతో గ్రామంలో అపరిశుభ్రత పెరిగి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ , స్వయంగా రంగంలోకి దిగి సమస్య మూలాలను పరిశీలించారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ ఎస్.భాస్కర్ రెడ్డి , రాజానగరం ఇంఛార్జ్ MRO పాపారావు , డిప్యూటీ తహసీల్దార్ గంగరాజు , మండల సర్వేయర్ అనిత గారు, ఇతర అధికారులు, స్థానిక పెద్దలు మరియు కూటమి నాయకుల సమక్షంలో చర్చలు జరిపి పారదర్శకంగా ఈ సమస్యకు పరిష్కారం చూపారు.
డ్రైనేజీ నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం రైతులు ఉల్లింగి మచ్చారావు, ఉల్లింగి సత్యనారాయణ గార్లతో ప్రత్యేకంగా చర్చించి వారి ఆమోదంతో స్థలాన్ని పంచాయతీ వారికి ఇప్పించి డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు.
గత పాలకులు చూపని చిత్తశుద్ధిని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రదర్శించి, 20 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించడం పట్ల పాత తుంగపాడు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేసారు.


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird