Home Uncategorized కాంగ్రెస్ పార్టీఖమ్మం జిల్లా కార్యదర్శిగా”దామా స్వరూప” నియామకం

కాంగ్రెస్ పార్టీఖమ్మం జిల్లా కార్యదర్శిగా”దామా స్వరూప” నియామకం

by VRM Media
0 comments

vrm media ప్రతినిధి ఖమ్మం

ఖమ్మం 13వ డివిజన్
కి చెందిన సామాజిక కార్యకర్త,కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దామా స్వరూప ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ కారక్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు పార్టీకి విధేయురాలు గా ఉంటూ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ క్రమశిక్షణతో,నిబద్ధతో పార్టీ బలోపేతానికి, మరియు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆమె చేస్తున్న కృషిని,ఆమెలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన జిల్లా నాయకత్వం సిఫార్సుల మేరకు అధిష్టానం దామా స్వరూపను కార్యదర్శిగా నియమించింది.తన నియామకానికి సహకరించిన ఖమ్మం డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ గారు ఖమ్మం టౌన్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, గారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, గారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు రామసహాయం రఘురామ రెడ్డి గారు రేణుక చౌదరి గారు తుమ్మల యుగంధర్ గారు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు జావిద్ గారు సౌజన్య గారు దయాకర్ రెడ్డి గారు లతో పాటు రాష్ట్ర, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి దామ స్వరూప ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ​ పార్టీ ఆదేశాలు,సూచనల మేరకు పార్టీ అప్పగించిన విధులను బాధ్యత గా శక్తివంచన లేకుండా నిర్వహిస్తానని, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ,ప్రభుత్వ చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అర్హులకు అందడానికి మరింత కృషి చేసి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి భాగస్వామ్యం అవుతానని తెలియజేశారు.ఆమె నియామకం పట్ల కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగంనాయకురాళ్లు,కార్యకర్తలు,శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

2,803 Views

You may also like

Leave a Comment