:
VRM న్యూస్ బాల మౌలాలి మార్చి 21
ఒంటిమిట్ట.
పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా జరుపుకునే ఈద్-ఉల్-ఫితర్ పర్వదినం ఒంటిమిట్ట మండలంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శనివారం నాడు ఈద్గా వద్ద ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో మత గురువులు రంజాన్ మాసం యొక్క పవిత్రత, ఆధ్యాత్మికత మరియు ఈద్ పండుగ యొక్క విశిష్టతను వివరించారు. రంజాన్ నెలలో ఉపవాసం ద్వారా మనసును పవిత్రం చేసుకోవడం, దైవ భక్తిని పెంపొందించుకోవడం ముఖ్యమని తెలిపారు. ఉపవాసం కేవలం ఆహార నియమం మాత్రమే కాకుండా, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలను దూరం చేసుకునే ఆధ్యాత్మిక సాధనగా పేర్కొన్నారు.ఒంటిమిట్టలోని మలకాటి పల్లి వద్ద ఉన్న మదరసాలో కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే మండలంలోని మండపం పల్లి, సీతాపురం, రాచపల్లి గ్రామాల్లో ముస్లింలు సమూహంగా నమాజ్ నిర్వహించి పండుగను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా మత గురువులు సమాజానికి కీలకమైన సందేశాన్ని అందజేశారు. పేదవారి బాధలను అర్థం చేసుకుని వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ధనిక-పేద అనే తేడా లేకుండా సమానత్వంతో, సౌభ్రాతృత్వంతో జీవించాలన్నారు. జకాత్, ఫిత్రా వంటి దానధర్మాల ద్వారా సమాజంలో సహకార భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.రంజాన్ పండుగ మనకు కేవలం ఆనందాన్ని మాత్రమే కాకుండా, దయ, కరుణ, సేవా భావం, సమానత్వం వంటి విలువలను నేర్పుతుందని మత పెద్దలు వివరించారు. ఈద్ పండుగను శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమానుల్లా, డీలర్ మస్తాన్, డాక్టర్ జిలాన్, తాజుద్దీన్, జాకీర్ హుస్సేన్, చాంద్ బాషా, అజ్మతుల్లా, ఇబ్రహీం, సత్తార్, మహమ్మద్ రఫీ, ముస్తఫా, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird