Home Uncategorized మన ఊరు – మన ఎమ్మెల్యే – మన పల్లెబాట”

మన ఊరు – మన ఎమ్మెల్యే – మన పల్లెబాట”

by VRM Media
0 comments

VRM media అయినవిల్లి భద్రం

PGRS / జనవాణి ప్రజా సమస్యల పరిష్కార వేదిక

— జనవాణి కార్యక్రమానికి వెల్లువెత్తిన ప్రజానీకం

— పలు సమస్యలను వినతుల రూపంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కి అందజేసిన ప్రజలు

— ప్రజా సేవే ముఖ్యంగా ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే బత్తుల

— సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వం

రాజానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ ‘మన ఊరు – మన ఎమ్మెల్యే – మన పల్లెబాట” కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించారు.. అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతీ ఇంటికీ వెళ్లి ప్రజల బాగోగులు అడిగి తెలుసుకుని వారికి ఏదైనా సమస్య ఉంటె వాటి గురించి అడిగి తెలుసుకుని, వెంటనే సంబంధింత అధికారులతో మాట్లాడారు.

👉 గ్రామంలో జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల వద్ద నుండి అందుకున్న అర్జీలను విశితంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ అర్జీలలో ముఖ్యంగా త్రాగునీరు, సాగునీరు, పెన్షన్, ఇళ్ల స్థలాలు, భూమి హెచ్చుతగ్గులు, సంక్షేమ పథకాల అమలు వంటి వాటిపై అర్జీలను అందుకుని పరిష్కరించారు.

👉 గ్రామంలో తాగునీటి సమస్య ఉందని తెలుసుకుని రాబోయే వేసవి కాలానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.. డ్రైనేజీ సమస్య వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని.. ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని తెలుసుకొని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూ. 50 లక్షల రూపాయలు గ్రాంట్ విడుదల చేయడం జరిగింది….

ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

2,803 Views

You may also like

Leave a Comment