వీ .ఆర్. మ్ మీడియా ప్రతినిధి భద్రం
టీడీపీ వైసీపీ పొత్తు నడుస్తుందా దేవీపట్నం మండలంలో….
మండలంలో ప్రజలను అయోమయానికి గురించేస్తున్నా వర్గపోరు.
టీడీపీ అధిష్టానం మండల అధ్యక్షుడు గా గోళ్ళ చంటిబాబును నియమించగా ఈరోజుకు రెండు పార్టీ కార్యాలయాలు ఎందుకు. ఎమ్మెల్యే వచ్చిన సరే మండల అధ్యక్షులు ఏర్పాటు చేసిన పార్టీ ఆఫిస్ వద్దకు ఆ రెండో కేడర్ ఎందుకు రావట్లేదు.
ఏదో సామెతలో దున్నపోతు దున్నపోతు కొట్టుకుని లేగ దూడ కాలు విరక్కోట్టినట్టు అయిపోయింది మండలంలో జనసేన బీజేపీ పని . రెండు వర్గాల నాయకులే ఎమ్మెల్యే వచ్చిన , ఏ ఇతర నాయకులు వచ్చిన , అధికారులు వచ్చిన ప్రోటోకాల్ వున్నవారిని పక్కకు తోసి మరి రాసుకుంటూ తిరుగుతూ ఉంటే మిగిలిన టీడీపీ జనసేన బిజెపి కేడర్ పరిస్థితి ఏంటి…అతి త్వరలో పంచాయితీ ఎలక్షన్లు వస్తున్నాయి అయితే దేవీపట్నం మండలంలో 14పంచాయితీ లలో ఎక్కడికక్కడ జనసేన కేడర్ వున్నాయి పంచాయితీ ఎన్నికల భరిలో దిగటానికి ఆసక్తి చూపిస్తూ వున్నారు అయితే 2024 ఎలక్షన్ ముందో లేక నెగ్గిన తర్వాతనో వైసీపీ నుంచి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు అయితే 10ల వయసునుంచి టీడీపీ లో ఎంతోమంది పెద్దలు సీనియర్లు వున్నా నూతనంగా పార్టీ లో చేరిన వారి హావ నడుస్తుంది…పెద్దలను సీనియర్ లను గౌరవించే పనే లేదు.
కొన్ని పంచాయితీలలో మేమే పంచాయితీ సర్పంచ్ క్యాండిడేట్స్ అని చెప్పుకుంటూ తిరుగుతూ ప్రజలను అయోమయం లో పడేస్తున్నారు.
మూడు పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులు శిరీష దేవి గారిని చర్చించలేదు ఒక మాట మంతి లేకుండానే అన్నింటికీ మేమే అంటూ అతి చూపిస్తున్నారు.
ఇప్పటికే వర్గపోరు వళ్ళ ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు టీడీపీ టీడీపీ కొట్టుకుని పొత్తు ధర్మాన్ని విస్మరిస్తూ కావాలనే రెండొవ వర్గం పొత్తు విలువలని నీరుగారుస్తున్నారు…ఇలానే ఉంటే 14పంచాయితీ లో జనసేన పార్టీ అభ్యర్థులు రెబల్ క్యాండిడేట్స్ గా పోటీ చెయ్యటానికి ఏమాత్రం అనుమానం లేదు …వైసీపీ టీడీపీ కలిపి మండలంలో ఏం చేస్తున్నారు ప్రజలకు తెలుసు పుల్ల,మట్టి, చేప,ధాన్యం,రేషన్ బియ్యం అంటూ ప్రతి దానిలో ఇన్వాల్ అయి చేస్తున్న అక్రమాలపై కచ్చితంగా గొంతు ఎత్తుతాం త్వరలోనే మంగళగిరి జనవాణి కార్యక్రమం లో అలానే టీడీపీ ప్రజాదర్బార్ లో ప్రతి విషయాన్నీ అర్జీ పెట్టి బహిర్గతం చేస్తాం ఇప్పటికైనా శాసనసభ్యులు కలగచెసుకుని ప్రోటో్కాల్ ని ఫాలో అవ్వాలని సరైన చర్యలు తీసుకోవాలని ప్రజలు మనల్ని మర్చిపోకముందే మనం మేలుకోవాలని తెలియచేస్తున్నాం అని దేవీపట్నం మండల జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి కొమరం దొరబాబు,ఎస్టీ సెల్ అధ్యక్షులు కుంజం శ్రీనివాస్ దొర ,మీడియా కోఆర్డినేటర్ కారం దుర్గా ప్రసాద్, తదితరులు తెలియచేసారు..
