అడ్వకేట్ డాక్టర్ పి.త్రినాధరావు.
VRM Midea ప్రతినిధి భద్రం
పోలవరం జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,రంపచోడవరం ఐటీడీఏ మీటింగ్ హాల్ నందు పెసా చట్టం మరియు పెసా గ్రామసభ విధి విధానాలపై,నిర్వహణపై దేవీపట్నం,రంపచోడవరం మారేడుమిల్లి గుర్తేడు మండలాలకు చేసిందిన పెసా గ్రామసభ ఉపాధ్యక్షులు మరియు కార్యదర్శులకు సమగ్రంగా అవగాహన కల్పించడం జరిగిందని పెసా గ్రామసభ ఉపాధ్యక్షులు తెల్లం శేఖర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….పెసా చట్టం గ్రామ స్థాయిలో పెసా గ్రామసభ ద్వారా ఎలా నిర్వహించాలో తెలిసిందన్నారు.కావున ప్రతి ఒక్కరు పెసా చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో చెదల నాగిరెడ్డి,కారం చిన్నాలు దొర,జి.బాబురావు,కె శివ,పి. గంగులు,కొమరం దొరబాబు,జోగి దొర,టి.రాజారెడ్డి,కె.సురేష్ రెడ్డి,ఎం.దూళి దొర మరియు పెసా గ్రామసభ మహిళా ఉపాధ్యక్షులు కార్యదర్శులు మొదలైన వారు పాల్గొన్నారు.


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird