
.webp)
గ్లోబల్ సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి ప్రూవ్ అయింది. తాజాగా విడుదలైన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే'(స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే) ట్రైలర్ రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ ట్రైలర్ ఏకంగా 1 బిలియన్ (100 కోట్లు) వ్యూస్ దాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగా ఉన్నారో ఈ రికార్డును స్పష్టం చేస్తోంది.
ట్రైలర్‌కు ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం ‘స్పైడర్ మ్యాన్’ పట్ల ఉన్న గ్లోబల్ మేనియాకు నిదర్శనం అని చెప్పవచ్చు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ ప్రస్తుతం ఈ చర్చలతోనే హోరెత్తుతున్నాయి.
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) లో మోస్ట్ అవేటెడ్ మూవీగా వస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’కు డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకుడు. ఈ చిత్రంలో టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్‌గా కనిపించనున్నాడు. అతనితో జోడీగా జెండయా నటిస్తుండగా, జాకబ్ బాటలన్, సాడీ సింక్, జాన్ బెర్న్తాల్, మార్క్ రుఫలో, మైఖేల్ మాండో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సోనీ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’, 2026 జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేసింది.