[ad_1]

-బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ చిత్రంతో బిజీ
-ఈ సారి రికార్డులు సృష్టించడమే లక్ష్యం
-బాలయ్య వీడియో వైరల్
గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ బాలకృష్ణ(బాలకృష్ణ) అఖండ 2(అఖండ 2)తో ఆగిపోయిన రికార్డులని తిరిగి సెట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకే గోపీచంద్ మలినేని(Gopinchand Malineni)మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని శరవేగంగా షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. రీసెంట్ గా బాలకృష్ణ ఢిల్లీలో జరిగిన 'ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ' కార్యక్రమంలో లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లోనే బాలకృష్ణ చేసిన ఒక పనితో బాలయ్య మనస్తత్వం ఎలా ఉంటుందో బయటపడింది. అభిమానులు అయితే మా బాలయ్య సీనియర్ నటిమణులకి ఇచ్చే గౌరవంతో మరోసారి తన మంచి మనసుని చాటుకున్నారని కొనియాడుతున్నారు. మరి పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.
బాలకృష్ణ ఈవెంట్ కి హాజరైన సమయంలో అలనాటి అందాల లెజండ్రీ నటి హేమమాలిని గారు కూడా ఈవెంట్ ప్రాంగణంలోకి వచ్చారు. ఆ సమయంలో హేమమాలిని గారిని బాలకృష్ణ చూసి ఆమె పాదాలకి నమస్కరించాడు. దీంతో హేమమాలిని(హేమమాలిని)గారు బాలకృష్ణని ఆశీర్వదించడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో లేటుగా అయినా బయటకొచ్చి లేటెస్ట్ గా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
ఇది కూడా చదవండి: సమంత: మహిళలంటే చిన్నచూపు, సమానత్వం లేదు.. క్షమాపణలు చెబుతున్నాం
హేమమాలిని గారు బాలీవుడ్ ని 70 ,80 ,90 వ దశకంలో చెడుగుడు ఆడుకుంది. ఆమె అందానికి, అంతకంటే అందమైన పెర్ఫార్మ్ కి అభిమాని కానీ వాడు భారతీయ సినీ ప్రేమికుడే కాదనే టాక్ కూడా నడిచింది. మరి ఈ లెక్కన బాలకృష్ణ కూడా అభిమాని అయ్యి ఉంటాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇదే ఈవెంట్ లో లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుని హేమామాలినితో పాటు ఆమె భర్త లెజెండ్రీ హీరో ధర్మేంద్ర కి కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.

[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird