vrm media leagal khammam ప్రతినిధి


ఖమ్మం జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్‌లో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. రాజగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీ పడదగ్గ కేసుల్లో ఇరువర్గాలు విజేతలేనని, లోక్ అదాలత్ తీర్పు సుప్రీంకోర్టు తుది తీర్పుతో సమానమని పేర్కొన్నారు. గతంలో 8,490 కేసులు పరిష్కరించి రాష్ట్రంలో ఖమ్మం జిల్లాను 6వ స్థానంలో నిలిపినట్లు ఆయన గుర్తుచేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి, సీనియర్ సివిల్ జడ్జి కల్పన, బార్ అసోసియేషన్ అధ్యక్షులు తొండపు వెంకటేశ్వర రావు, బార్ కౌన్సిల్ సభ్యులు శ్రీనివాసరావు తదితరులు కక్షిదారులు సమయం, డబ్బు వృధా చేసుకోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా భార్యాభర్తల వివాదాలు రాజీ పడటం వల్ల ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని న్యాయమూర్తి తెలిపారు. ప్రమాద బీమా సెటిల్మెంట్ అందుకున్న వారికి అవార్డుతో పాటు పూల మొక్కలను అందజేశారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird