Home Uncategorized వెలుగుమట్ల అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

వెలుగుమట్ల అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

by VRM Media
0 comments

vrm media ఖమ్మం ప్రతినిధి

​ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్ లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదల సంక్షేమానికే ప్రధమ ప్రాధాన్యమని, వెలుగుమట్లను అన్ని సౌకర్యాలతో కూడిన మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే విద్యుత్, త్రాగునీటి పనులు పూర్తయ్యాయని, నెల రోజుల్లో డ్రెయిన్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్లు జయచందర్, సైదులు తదితరులు పాల్గొన్నారు.

2,808 Views

You may also like

Leave a Comment