Home ఎంటర్‌టెయిన్మెంట్ దీపకు జ్యోత్స్న వార్నింగ్, ఆస్తుల పంచాయితీలో కొత్త మలుపు! – VRM MEDIA

దీపకు జ్యోత్స్న వార్నింగ్, ఆస్తుల పంచాయితీలో కొత్త మలుపు! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ‘కార్తీక దీపం2′(కార్తీక దీపం 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -630 లో…..జ్యోత్స్న తో దీపం మాట్లాడుతుంది. నేను ఆట ఎంత గొప్పగా ఆడినా ఓడిపోతూనే ఉన్నానని జ్యోత్స్న అంటుంది. నువ్వు నీ కోసం ఆడుతున్నావ్ అందుకే భయపడుతున్నావ్.. నేను అలా కాదు.. నా వాళ్ళ కోసం ఆడుతున్నాను.. నాకు భయం లేదని దీప సమాధానం చెప్తుంది. నేను ఎవరిని వదలనని జ్యోత్స్న అంటుంది. దశరత్, సుమిత్రని ఏమైనా చేస్తుందేమోనని దీపంలో భయం మొదలవుతుంది.

ఆ తర్వాత కాశీ దగ్గరికి దాస్ వచ్చి మాట్లాడతాడు. నువ్వు నాతో మాట్లాడకు. కొడుకు జీవితం ఏమైనా పర్వాలేదా నాన్న, కోడలికి పెళ్లి చేస్తానని అంటున్నావని దాస్ పై కాశీ కోప్పడతాడు. ఇప్పుడు స్వప్న తన అమ్మనాన్నలతో ఉంది.. నువ్వు ఎదురుగా ఉన్నావ్.. ఇప్పుడు తనకి నిన్ను మిస్ అవుతున్న బాధ ఎలా తెలుస్తుంది.. అందుకే ఈ పెళ్లి అన్నాను.. ఇప్పుడు నీ నుండి మిస్ అవుతున్నానని తన పెళ్లి తనే చెడగొడుతుందని కాశీ తో దాస్ అంటాడు.

అప్పుడే దాస్ కి కార్తీక్ ఫోన్చేస్తాడు . నేను చెప్పినట్లు చెయ్ అని దాస్ తో కార్తీక్ ఏదో చెప్తాడు. అది విని దాస్ షాక్ అవుతాడు. సరే అల్లుడు.. నువ్వు ముందుండి నడిపిస్తుంటే నువ్వు ఎలా చెప్తే అలా చేస్తానని దాస్ అంటాడు.

ఆ తర్వాత జ్యోత్స్నకి పారిజాతం ‘టీ’ ఇచ్చి తాగు బాడీ టెన్షన్ తో హీట్ ఎక్కిందని పారిజాతం అంటుంది. ఇంకేంటి పదిహేను నెలల్లో పెళ్లి చేసుకొని పిల్లలు కను అని పారిజాతం అంటుంది. నేను ఏమైనా మిషన్ అనుకున్నావా అని పారిజాతంపై కోప్పడుతుంది.

ఆ తర్వాత అసలు ఏం చేస్తున్నావ్ మావయ్య.. మాకు ఆస్తులు ఏంటని దశరథ్ తో కార్తీక్ అంటాడు. నాకు జ్యోత్స్న అంటే ప్రేమ ఉంది రా.. ఆస్తుల కోసం అయినా పెళ్లి చేసుకుంటుంది.. అలా కాకపోతే నా కూతురికి న్యాయం జరుగుతుందని దశరథ్ అంటాడు. జ్యోత్స్న పెళ్లి చేసుకోకపోయినా తనకే ఆస్తులు ఇవ్వండి నాన్న అని దీప అంటుంది. ఆస్తులపై తను ప్రేమ పెంచుకుంటే నువ్వు మనుషులపై ప్రేమ పెంచుకున్నావని దీపతో దశరథ్ అంటాడు.

ఆ తర్వాత రాత్రి కార్తీక్ తన పని చేసుకుంటుంటే.. అన్నయ్య ఎందుకు మేనల్లుడికి ఆస్తులు అన్నాడని కాంచన అడుగుతుంది. అందులో నువ్వు కూడా వస్తావ్ కదా అమ్మ అని కార్తీక్ అంటాడు. ఇందులో నీ ప్రమేయం ఏదైనా ఉందా అని కార్తీక్ ని కాంచన అడుగుతుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

2,801 Views

You may also like

Leave a Comment