[ad_1]

మెగాస్టార్ చిరంజీవి(మెగాస్టార్ చిరంజీవి) బాక్సాఫీస్ వద్ద సృష్టించే వసూళ్ళ సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన 'వాల్తేరు వీరయ్య' అందించిన మాస్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర), మళ్ళీ మెగాస్టార్‌తో జతకట్టారు. వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పైకి ఈ మూవీ త్వరలోనే సెట్స్ వెళ్ళనుంది. (మెగా 158)
మెగాస్టార్ కెరీర్లో 158వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ కోసం బాబీ ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. ఈ కథలోని మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామా చిరంజీవికి బాగా నచ్చాయట. 'వాల్తేరు వీరయ్య'లో చిరంజీవిని వింటేజ్ లుక్‌లో చూపించి అభిమానులకు విందు భోజనం పెట్టిన బాబీ, ఈసారి అంతకు మించిన యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానుందని సమాచారం.
గతంలో బాబీ దర్శకత్వంలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించడమే కాకుండా, చిరంజీవి మాస్ ఇమేజ్ను మరోసారి శిఖరాగ్రాన నిలబెట్టింది. ఆ సినిమాలో చిరు కామెడీ టైమింగ్ థియేటర్లలో రచ్చ చేసింది. మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అవుత అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈసారి మెగాస్టార్‌ను బాబీ ఎలాంటి కొత్త కోణంలో చూపిస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా, 2026 సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో రికార్డు వసూళ్ళు సాధించిన చిరంజీవి, ఈ ఏడాది 'విశ్వంభర' అనే భారీ సోషియో ఫాంటసీ ఫిల్మ్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మాణం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird