VRM మీడియా ప్రతినిధి అయినవిల్లి భద్రం తేది;30-03-2026, సోమవారం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం విడతగా 2.5 లక్షల గృహ ప్రవేశాలు
21 నెలల్లో 5.50 లక్షల మంది పేదలకు ఇళ్ల అందజేసిన సర్కార్
పోలవరం జిల్లాలో పీఎం-జన్ మన్ 367మరియు పి ఎమ్ ఎవై 24 వెరసి391గృహాల ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే శిరీషాదేవి , ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి, పీవో స్మరణ రాజ్ లు
👉ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి
రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రంప చోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి అన్నారు. సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం రంపచోడవరం గృహ నిర్మాణ శాఖ EE ఏ.రవికుమార్ సౌజన్యంలో రంపచోడవరం మండలం భీరంపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామూహిక గృహ ప్రవేశాల ద్వారా పేదల సొంతింటి కలలను సాకారం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రెండో విడత ఇళ్ల పంపిణీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 2.5 లక్షల గృహ ప్రవేశాలను ఘనంగా నిర్వహించామన్నారు.
ఈ సందర్భంగా పోలవరం జిల్లా వ్యాప్తంగా 391 గృహాలను సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో లబ్ధిదారులకు అందజేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ళ బొజ్జిరెడ్డి, ఐటిడిఎ PO బచ్చు స్మరణ రాజులతో కలిసి ఆమె ప్రారంభోత్సవం చేశారు. లబ్ధి దారులతో ముచ్చటించిన ఆమె వారి కళ్ళల్లో ఆనందాన్ని చూశారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ పేదల పట్ల చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.
21 నెలలు వ్యవధిలో 5.50 లక్షల ఇళ్లు ప్రారంభించిన ఘనత కూటమిదే
కూటమి అధికారంలోకి వచ్చి 21 నెలలో రెండోసారి ప్రభుత్వం ఇళ్ల పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి అన్నారు. గతేడాది నవంబర్ నెలలో 3 లక్షల ఇళ్లను రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అప్పగించామన్నారు. ప్రస్తుతం
రెండో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష టిడ్కో ఇళ్లతో పాటు మరో 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించిన ఘనత కూటమి పార్టీదే అని కొనియాడారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి, పీవో బచ్చు స్మరణ రాజు , క్లస్టర్ ఇంచార్జి కారం సింహాచలం, సర్పంచ్ నూకరాజు, పూల మంగేశ్వర రావు, కారం వెంకటేశ్వర్లు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కోసు నాగన్నదొర, చోడి నూకరాజు, MPTC కూర రమణమ్మ, సీతపల్లి దేవస్థానం బాపనమ్మ తల్లి చైర్మన్ బాపన్న దొర, బీజేపీ నాయకులు ఈకా బుల్లి కొండలు దొర, జనసేన నియోజక వర్గ నాయకులు కుర్ల రాజశేఖర్ రెడ్డి , వినోద్, KLNG వరప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ఈ ఈ ఏ.రవికుమార్, డి ఈ ch శ్రీరామచంద్రమూర్తి, AE బి సత్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు.


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird