Home Uncategorized పోలవరం ముంపు గ్రామాలలో పర్యటన. – జాతీయ ఆదివాసి హక్కుల పరిరక్షణ కమిటీ.

పోలవరం ముంపు గ్రామాలలో పర్యటన. – జాతీయ ఆదివాసి హక్కుల పరిరక్షణ కమిటీ.

by VRM Media
0 comments

VRM media అయినవిల్లి భద్రం

  • అధికారులను అన్ని విషయాలలో సహకరించినందుకు,, అన్నివిధాలా నష్టపోయిన, 8 గ్రామాలు.
  • నిర్వశితులను నిండా ముంచిన అధికారుల.
  • పరిహారం ఇచ్చేందుకు ఎస్.ఈ.ఎస్ ప్రకారం ప్యాకేజీ.
  • 20సం. లు అయినా,మాభూములు ఎక్కడో తెలియని ముంపు రైతులు,పూర్తి స్థాయిలో అందని పరహారం.
  • అధికారులు, గ్రామాల్లో మధ్యావర్తుల దందా వల్ల అమాయకులకు అన్యాయం.
  • ప్రతి గ్రామంలో అర్హులు అయినా అందని ఆర్ అండ్ ఆర్ ప్యాకెజీ.

దేవీపట్నం డెక్కన్ న్యూస్. మార్చి 31.

పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని పోలవరం ముంపు కు సంబంధించి గత 20 సంవత్సరాల నుండి ప్యాకేజీలు అందలేదని కొంతమంది అలాగే మా భూములు మాకు ఎక్కడో తెలియని పరిస్థితిని రైతులు, గత రెండు వారాలుగా పోలవరం నిర్వాసిత గ్రామాలు పర్యటిస్తున్నటువంటి, జాతీయ ఆదివాసి హక్కుల పరిరక్షణ కమిటీ, సభ్యులకు తమ తమ గోడును వివరిస్తున్న దేవిపట్నం ముంపు నిర్వశితా గ్రామాల ప్రజలు,

*అసలు పునరావాసం ఎప్పటినుండి.ఆర్ అండ్ ఆర్ ప్యాకెజీ ఎలా ఇచ్చారు. *

2005సం. నుండి అప్పటిలో అధికారులు పరగసాని పాడు, డి. రావిలంక, బోడిగూడెం, అధికారులు చెప్పిన మాట ప్రకారం, అన్నివిధాలా సహకరించిన ఈరోజు అతి తక్కువగా పరిహారంతో, మరియు మా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. మొదటి ఫేస్ లో, గల పరగసానిపాడు, డి. రావిలంక, బోడిగూడెం, గ్రామాలకు 2006సం. లో అక్టోబర్ 02 నా, ఇళ్ళు నిర్మించి, అధికారులే అత్యుత్చాహం చూపి,పాలు, బెల్లం, ఇచ్చి బలవంతం గా గృహ ప్రవేశం చేయించి న రోజునుండి, 3సం. ల తరువాత 2008-09సం.లో కూలీవేతనం అంటూ ప్యాకేజీ,58వేలు, భూమి లేని కుటుంబాలకి ఇచ్చారు, మరల 2013సం. లో మార్చి లో పాత గ్రామంలో ఇంటి పరిహారం ఇవ్వడం జరిగింది. అలాగే 2016సం. లో 2లక్షలు రూపాయలు, ఇవ్వడం జరిగింది.అలాగే 18సం. ల ప్యాకెజీ యువతీ యువకులకు 5,80,000 /-రూపాయలు ఇవ్వడం జరిగింది.అలాగే రెండోవ లిస్ట్ లో యువకులకు ఖాళీ 50/-బాండు పేపర్ లో సంతకాలు చేయించుకొని ప్యాకెజి ఇవ్వలేదు. కనుక ప్రస్తుతం ఆర్ అండ్ ఆర్ ప్యాకెజీ 6,80000/-రూపాయలు ఇవ్వడం జరిగుతుంది, ఆవిధంగానే ఇవ్వమని అధికారుల చుట్టూ తిరుగుతూనే మా బ్రతులు,,,, అధికారులే గోదారిలో ముంచేసారు, ఇలా మరో ఐదు గ్రామాలు, నాగళ్లపల్లి,పి.గోందూరు,నేలకోట,గండికోట, అంగుళూరు,నిర్వాసితులు,పరిస్థితి ఇలానేవుంది.అంటూ మా బ్రతుకులు ఎలా వుంటాయో అని ఆందోళన వ్యక్తం చేసారు.

అధికారులు పని చేయకే పోలవరం నిర్వశితులకు అన్యాయం.

అధికారులు, నిర్వశితులు సమస్యలపై మండల స్థాయిలో ఎవరిపని వారు చెయ్యకుండా, దళారీలతో తో కలిసి అసలుయిన లబ్ధిదారులు కి అన్యాయం చేయడం జరుగుతుంది.

భూమికి భూమి రైతుకి ఇష్టం లేకుండా బలవంతంగా అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు.
ఇష్టం లేకుంటే దశాబ్దాకాలంగా ఎదురు చూడడమే.
ఈ విధంగా ముంపు గ్రామాలలో పర్యటనకు వొచ్చిన జాతీయ ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ ముందు నిర్వాసితులు కన్నీటి పర్వంతా మయ్యారు.
జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమన్వయ కమటీ కన్వీనర్ మరియు మాజీ ఎమ్మెల్యే : కె రాజారావు, బహుజన ఫోరం రాష్ట్ర జిల్లా నాయకులు, కన్వీనర్: బి. పరం జ్యోతి,జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కులపరిరక్షణ సమన్వయకమిటి జిల్లా అధ్యక్షులు :రాజబాబు, రాష్ట్ర కన్వీనర్ : గరిడే బాబురావు, పోలవరం జిల్లా చైర్మన్ :బండి చిన్న వెంకటరమణ, బి సి సమన్వయ కమిటీ చైర్మన్ : లక్ష్మీనారాయణ, ఆదివాసీ నాయకులు :కారం రామన్న దొర, యాలగాడా నాగేశ్వరావు, అభిరాజు, అలాగే మడిపల్లి గ్రామస్థులు, పరగసానిపాడు, బోడిగూడెం, డి. రావిలంక గ్రామస్థులు పాల్గొన్నారు.

2,802 Views

You may also like

Leave a Comment