వీ ఆర్ మ్ మీడియా ప్రతినిధి (భద్రం)
పోలవరం జిల్లా దేవీపట్నం మండలం లో చిన్న రమణయ్యపేట R&R కాలనీ కమలం పాలెం కు సంబంధించిన , కోయ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల నందు ఈరోజు స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు మధ్యాహ్నం భోజనం చేయడానికి ప్లేట్స్ ను గోకవరం మండలం గోకవరం గ్రామానికి చెందిన ఇనకోటి పెద్దలయ్య, ఇనకోటి బాపన దొర,పిల్లలకు 40 ప్లేట్స్ మరియు వాటర్ టిన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దేవీపట్నం మండలం ఎంఈఓ అయినటువంటి త్రిమూర్తులు, SMC చైర్మన్ శంకర్ , వైస్ చైర్మన్ పొడుగు పద్మ , గ్రామంలో ఉన్నటువంటి పీసా నాయకులు దొరబాబు, రాజు, గ్రామంలో యూత్ లీడర్స్ , కారం దుర్గా ప్రసాద్, పుసం సురేష్,పొడుగు రమణ , స్కూల్ HM కరిబండి రాజు, తోటి ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.. అలాగే భోజనం ప్లేట్స్ ఇచ్చిన దాతలను స్కూలు యాజమాన్యం వారు గ్రామస్తులు, తల్లిదండ్రులు, ఘనంగా సన్మానించడం జరిగింది.

