Home ట్రెండింగ్ ఉచిత బస్సు, రూ. 3,000 పింఛన్: రేవంత్ విక్టరీ ఫార్ములా | మహిళలకు ఉచిత KSRTC ప్రయాణం, ఇందిరా క్యాంటీన్ విస్తరణ మరియు ఉచిత రేషన్ మద్దతు, UDF వాగ్దానాలు – VRM MEDIA

ఉచిత బస్సు, రూ. 3,000 పింఛన్: రేవంత్ విక్టరీ ఫార్ములా | మహిళలకు ఉచిత KSRTC ప్రయాణం, ఇందిరా క్యాంటీన్ విస్తరణ మరియు ఉచిత రేషన్ మద్దతు, UDF వాగ్దానాలు – VRM MEDIA

by VRM Media
0 comments
ఉచిత బస్సు, రూ. 3,000 పింఛన్: రేవంత్ విక్టరీ ఫార్ములా | మహిళలకు ఉచిత KSRTC ప్రయాణం, ఇందిరా క్యాంటీన్ విస్తరణ మరియు ఉచిత రేషన్ మద్దతు, UDF వాగ్దానాలు


భారతదేశం

ఓయ్-చంద్రశేఖర్ రావు

కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతిపక్ష యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ప్రతిపక్ష నేత వీడీ సతీషన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం కొచ్చిలో దీన్ని ఆవిష్కరించారు. సంక్షేమ పెన్షన్లను రూ. 3,000కు పెంచడం, ధాన్యానికి కిలో రూ. 35 మద్దతు ధర, ఆశా వర్కర్ల దినసరి వేతనం రూ.700కి పెంచడం వంటి కీలక హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ ప్రదర్శన రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా.

అయిదు ప్రధాన హామీలు..

తిరువనంతపురంలో రాహుల్ గాంధీ పుతు యుగ యాత్ర ముగింపులో ప్రకటించారు ప్రధాన హామీల ఆధారంగా ఈ మేనిఫెస్టో రూపొందించబడింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి 100 ఇచ్చిన హామీలను అమలు చేసినట్లుగానే, యూడీఎఫ్ కూడా జాప్యం లేకుండా తమ వాగ్దానాలను నిలబెట్టుకుంటామని సతీషన్ ధీమా వ్యక్తం చేశారు.

మహిళలకు ఉచిత KSRTC ప్రయాణం ఇందిరా క్యాంటీన్ విస్తరణ మరియు ఉచిత రేషన్ మద్దతు UDF వాగ్దానాలు

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..

ఈ అయిదు హామీలలో మహిళలకు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) బస్‌లలో ఉచిత ప్రయాణం, కళాశాల విద్యార్థులకు నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయం అందించడం, దివంగత ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పేరుతో రూ. 25 లక్షల ఆరోగ్య బీమా, సంక్షేమ పెన్షన్లు రూ. 3,000కు పెంపు, యువ పారిశ్రామికవేత్తలకు వడ్డీ లేని రుణాలు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ప్రభుత్వ విభాగం ఏర్పాటు ప్రధానమైనవి.

ఇందిరా క్యాంటీన్లు..

మేనిఫెస్టో సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం, వ్యవసాయ సంస్కరణలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. అర్హులైన లబ్ధిదారులందరికీ సామాజిక భద్రతా పెన్షన్లు అందేలా చట్టాన్ని తీసుకువస్తామని, ఆకలి రహిత కేరళ రాష్ట్రాన్ని దీర్చిదిద్దే అవకాశం ఉందని ఇందిరా క్యాంటీన్లను విస్తరిస్తామని కూడా యూడీఎఫ్ ప్రకటించింది. ప్రత్యేక పరిస్థితులు, ప్రాంతాలలో అర్హులైన వర్గాలకు ఉచిత రేషన్ మద్దతు అందిస్తారు. పేదరిక నిర్మూలనకు ఆశ్రయ పథకం రెండవ దశలో నవ ఆశ్రయను అమలు చేసి యూడీఎఫ్ విడుదల చేసింది.

సిద్ధార్థన్ పేరు మీద..

ఇది సమాజంలోని అత్యంత బలహీన వర్గాలను గుర్తించి మద్దతు ఇవ్వడం కోసం పెట్టుకుంది. క్యాంపస్ సమస్యల పరిష్కారంపైనా మేనిఫెస్టో దృష్టి సారించింది. సిద్ధార్థన్- స్టూడెంట్ డిస్ట్రెస్ విద్యా సంస్థలలో రక్షణను మెరుగుపరిచే యాప్ తయారు చేయడానికి యాంత్రిక ర్యాగింగ్ అండ్ స్టూడెంట్ వెల్ఫేర్ చట్టాన్ని యూడీఎఫ్ ప్రతిపాదించింది. వాయనాడ్‌లోని ఓ వెటర్నరీ కళాశాల విద్యార్థి సిద్ధార్థన్ ర్యాగింగ్ ఆరోపణల తర్వాత మరణించినందున వీటికి ఈ పేరు పెట్టబడింది.

ఆశ వర్కర్ల దినసరి వేతనం..

యువత సాధికారతకు యువశక్తి నాడిన సంపత్ కింద ప్రణాళికా వ్యయంలో అయిదు శాతం కేటాయింపు, కుటుంబశ్రీ తరహాలో యువశ్రీ కలెక్టివ్‌లను ప్రవేశపెడతామని యూడీఎఫ్ హామీ ఇచ్చింది. ఆశ వర్కర్ల దినసరి వేతనం రూ. 700కి పెంపు, అంగన్‌వాడీ, పాఠశాల వంటవాళ్ళతో సహా ఇతర కార్మికుల వేతనాలను సవరించి మెరుగైన ప్రయోజనాలు అందిస్తామని యూడీఎఫ్ ప్రతిపాదించింది. వ్యవసాయ సంస్కరణలలో భాగంగా ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్, ఎంఎస్ స్వామినాథన్ కమీషన్ కనీస మద్దతు ధరల సిఫార్సుల అమలుకు యూడీఎఫ్ హామీ ఇచ్చింది.

రబ్బర్‌కు రూ. 300 మద్దతు ధర..

రబ్బర్‌కు రూ. 300 మద్దతు ధరతో పాటు సీఐఏఎల్ నమూనాలో రబ్బర్ కంపెనీ ఏర్పాటుకు హామీ ఇచ్చింది. కొబ్బరికి మద్దతు ధరల పెంపు, కొనుగోలు కేంద్రాల విస్తరణ కూడా ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. మానవ-వన్యప్రాణి సంఘర్షణల నియంత్రణకు డ్రోన్లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ ఆధారిత నిఘా వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. వన్యప్రాణుల దాడుల్లో మరణించిన వారికి ఇచ్చే పరిహారాన్ని 50 శాతం పెంచుతామని కూడా మేనిఫెస్టోలో స్పష్టం చేశారు.

2,804 Views

You may also like

Leave a Comment