[ad_1]

-రంగంలోకి ఎగ్జిబిటర్స్
-వాళ్ళని బతికించడమే లక్ష్యమా!
-మరికొందరు అదే బాటలోకి వస్తారా
స్టిల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ నలుగురు స్నేహితులు కలిసినా అరె మావా ఈ రోజు సినిమాకి వెళ్దామా అని మాట్లాడుకుంటూ ఉంటారు. పైగా సింగల్ స్క్రీన్‌లో సినిమా చూస్తే వచ్చే మజానే వేరుగా ఉన్న పరుగులు తమకి అందుబాటులో ఉన్న థియేటర్ కి పెడతారు. ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న ఆనవాయితీ కూడా. రీసెంట్ గా తెలంగాణకి సంబంధించిన సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యాజమాన్యం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ వార్త సినీ సర్కిల్స్ , మూవీ లవర్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటో చూద్దాం.
ఇప్పటివరకు థియేటర్ల యజమానులు అలియాస్ ఎగ్జిబిటర్స్ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా నిర్ణీత అద్దెని వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ అద్దె ప్లేస్ లో సినిమా తమ థియేటర్ లో కనిపిస్తున్న అన్ని రోజులు పర్సంటేజ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఫస్ట్ వీక్ 60%,సెకండ్ వీక్ 50%, థర్డ్ వీక్ 40% చొప్పున తెలంగాణ ఫిలిం, ఏషియన్ సునీల్ తీర్మానించారు. ఈ మేరకు ప్రస్తుతం 23 థియేటర్లు కొచ్చి ఈ విషయాన్నీ ప్రకటించాయి. ఇది సక్సెస్ అయితే మరిన్ని థియేటర్లు ఇదే బాట పట్టే అవకాశం ఉంది. దీనివల్ల నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి మరియు ఎగ్జిబిటర్లకి మధ్య ఒక ఆరోగ్యకరమైన వ్యాపార వాతావరణం ఏర్పడుతుందని సినిమా మంచి కోరుకునే వాళ్లంతా ఆశపడుతున్నారు. ఏప్రిల్ 3,నుంచి ఈ విధానం అమలు.
ఇది కూడా చదవండి: Niharika konidela: విశ్వక్ సేన్, నేను ఒక్క సాంగ్ తోనే ఆపేశాం.. వైరల్ అవుతున్న నీహారిక మాటలు
టాలీవుడ్లో గత కొంత కాలంగా ఓటీటీ ప్రభావం, భారీ బడ్జెట్ సినిమాల కొరత, మరియు పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు సింగిల్ స్క్రీన్స్‌ను కోలుకోలేని దెబ్బ తీశాయి. చాలా చోట్ల భార నిర్వహణ కాక యజమానులు థియేటర్లని మూసివేసే ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాది సినిమా ఎగ్జిబిటర్లందరూ కలిసి ఒక ఉమ్మడి నిర్ణయానికి రావాలని భావించారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ఏకాభిప్రాయానికి ప్రతిరూపంగా నిలుస్తోంది.
.webp)
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird