Home ట్రెండింగ్ కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా సరే.. అలా చేస్తానంటూ వైసీపీ నేత వార్నింగ్ ! | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు – VRM MEDIA

కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా సరే.. అలా చేస్తానంటూ వైసీపీ నేత వార్నింగ్ ! | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు – VRM MEDIA

by VRM Media
0 comments
కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా సరే.. అలా చేస్తానంటూ వైసీపీ నేత వార్నింగ్ ! | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-కొరివి జయకుమార్

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని చేసిన సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు తెరలేపాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి అంతు చూస్తా అని వార్నింగ్ ఇచ్చారు.
ముఖ్యంగా పోలీసులపై ఆయన చేసిన విమర్శలు, హెచ్చరికలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. అలాగే కొల్లు రవీంద్రను ఉద్దేశించి కూడా ఆయన ఘాటు విమర్శలు చేశారు. “పేదల గుండెల్లో నువ్వు పెట్టిన నొప్పిని నీకూ చూపిస్తా” అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి.

“అధికారంలోకి వచ్చాక చూస్తా”…

అలానే పేర్ని నాని మాట్లాడుతూ.. పోలీసు అధికారులను నేరుగా ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు చేశారు. కాకుండా ఈ వివాదంలో అసిస్టెంట్ కమిషనర్ అంతేగోపాలరావును ఉద్దేశించి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేపాయి. 2029లో వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు.. నువ్వు ఎక్కడికి పారిపోయినా వదలను. బందరు కాదు.. ఆంధ్రా రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాసరే.. నువ్వు తెలంగాణ వెళ్తే.. అవసరమైతే కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా” అని పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోయారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులపై సంచలన వ్యాఖ్యలు వైరల్

పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం..

మరోవైపు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై జిల్లా పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ శాఖను బెదిరించేలా మాట్లాడటం అనేది అంగీకారయోగ్యం కాదని వారు స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీస్తుందని, ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాన్ని కాపాడే సంస్థలపై ఒత్తిడి తేవడం సరైంది కాదని పేర్కొన్నారు.

ఈ ఘటనలో పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు పాత్ర కూడా చర్చకు వచ్చింది. బందరు ప్రాంతంలో పోలీసులతో ఆయన వ్యవహరించిన తీరుపై కూడా అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం కుటుంబ స్థాయిలోనే పోలీస్ శాఖపై ప్రభావం చూపే ప్రయత్నంగా కనిపిస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వ అధికారులను బెదిరించేలా వ్యాఖ్యలు చేయడం చట్టపరంగా సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. ఈ వ్యాఖ్యలపై ఎలాంటి లీగల్ చర్యలు తీసుకుంటారన్నదానిపై కూడా చర్చ జరుగుతోంది.

2,802 Views

You may also like

Leave a Comment