Home ట్రెండింగ్ సాష్టాంగ ప్రణామం.. ఆంధ్రుల ఆత్మగౌరవానికి దక్కిన విజయం | అమరావతి ఆగదు: రాజధాని బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఫౌండేషన్ సైట్ వద్ద సీఎం చంద్రబాబు సాష్టాంగం – VRM MEDIA

సాష్టాంగ ప్రణామం.. ఆంధ్రుల ఆత్మగౌరవానికి దక్కిన విజయం | అమరావతి ఆగదు: రాజధాని బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఫౌండేషన్ సైట్ వద్ద సీఎం చంద్రబాబు సాష్టాంగం – VRM MEDIA

by VRM Media
0 comments
సాష్టాంగ ప్రణామం.. ఆంధ్రుల ఆత్మగౌరవానికి దక్కిన విజయం | అమరావతి ఆగదు: రాజధాని బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఫౌండేషన్ సైట్ వద్ద సీఎం చంద్రబాబు సాష్టాంగం


ఆంధ్ర ప్రదేశ్

ఓయి-లింగారెడ్డి గజ్జల

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడింది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో సవరణ బిల్లు ఆమోదం పొందిన వేళ, రాజధాని ప్రాంతం సంబరాల్లో మునిగిపోయింది. ఈ చరిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు ఉద్దండరాయుని పాలెం చేరుకుని, రాజధాని రైతులతో కలిసి వేడుకల్లో ఉన్నారు.

తన సతీమణి భువనేశ్వరితో కలిసి అమరావతి శంకుస్థాపన శిలాఫలకాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెచ్చిన పవిత్ర మట్టి, యమునా నది జలాలు ఉంచిన వేదిక వద్ద దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, దీప హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన ముఖ్యమంత్రి, ఆ పవిత్ర వేదికకు సాష్టాంగ ప్రణామం చేశారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మరియు వేలాది మంది రైతులు ఉన్నారు.

రాజధాని బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత అమరావతిని ఆపలేని సీఎం చంద్రబాబు ఫౌండేషన్ సైట్ వద్ద సాష్టాంగ ప్రణామం చేశారు.

అమరావతి చరిత్ర శాశ్వతం.. రైతుల త్యాగం అమరం!

అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ, ఈ రోజు దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజని కొనియాడారు. “అమరావతి అంటే కేవలం ఒక ప్రాంతం కాదు, అది ఆంధ్రుల ఆత్మగౌరవ చిహ్నం. అనేక కుట్రలను ఎదుర్కొని, ఐదేళ్ల చీకటి రోజులను దాటి ఇవాళ ప్రజా రాజధానిని సాధించుకున్నాం. ఇది ప్రజా సంకల్పానికి దక్కిన విజయం” అని ప్రకటించారు. 29 వేల మంది రైతులు నమ్మకంతో ఇచ్చిన 33 వేల ఎకరాల భూమి వల్లే ఇవాళ రాజధానికి ఈ స్థాయి దక్కిందని, వారి త్యాగం శాశ్వతంగా నిలిచిపోతుందని కొనియాడారు.

వైసీపీ ప్రధానికి నిప్పులు.. కృతజ్ఞతలు..

గత ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభించి అమరావతిని స్మశానంగా మార్చాలని చూశారు. రాజధానితో మూడు ముక్కలాట ఆడి అడ్రస్ లేకుండా పోయారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తుంటే పార్లమెంటు నుంచి వాకౌట్ వైసీపీ చేసింది, ప్రజలే బ్లాక్ అవుట్ చేయాలి” అని పేర్కొన్నారు. అదే సమయంలో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు మరియు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

ఉద్యమ వీరత్వం.. భవిష్యత్తు విజయం..

రాజధాని కోసం మహిళలు, రైతులు చేసిన 1631 రోజుల పోరాటాన్ని చంద్రబాబు స్మరించుకున్నారు. నాడు తన సతీమణి భువనేశ్వరి ఉద్యమానికి మద్దతుగా తన చేతి గాజులను ఇచ్చారని, పవన్ కళ్యాణ్ ముళ్ల కంచెలు దాటి వచ్చి రైతులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. “అమరా అజేయం, అజరామరం. పార్లమెంటులో చేసిన ఈ చట్టాన్ని ఇక ఎవరూ మార్చలేరు. ప్రజల సహకారంతో ప్రపంచంలో అత్యుత్తమ అభివృద్ధి మోడల్‌ను అమరావతికి తెస్తాను. రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని సమానంగా అభివృద్ధి చేస్తాను” అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. “ఇప్పటి వరకు మన రాష్ట్రానికి అడ్రస్ లేదు, ఇప్పుడు సరైన అమరావతి రూపంలో మనకు శాశ్వత అడ్రస్ వచ్చింది” అని చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.

2,801 Views

You may also like

Leave a Comment