[ad_1]
వ్యాపారం
ఓయి-లింగారెడ్డి గజ్జల
యుద్ధం అంటే కేవలం తుపాకుల మోత, క్షిపణుల దాడి మాత్రమే కాదు.. అది సామాన్యుడి వంటింటి బడ్జెట్ను, చివరికి ప్రాణరక్షక మందుల బిల్లును కూడా తలకిందులు చేస్తుంది. పశ్చిమాసియాలో (మిడిల్ ఈస్ట్) కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ఇప్పుడు నేరుగా ఫార్మా రంగంపై పడిపోయింది. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు స్తంభించిపోవడంతో, మందుల తయారీకి వాడే ముడిపదార్థాల ధరలు కళ్లు చెదిరే రీతిలో పెరిగాయి. ఫలితంగా మందుల ధరలు గరిష్ఠంగా 180 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఫార్మా రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారతీయ ఫార్మా పరిశ్రమ ముడిపదార్థాల కోసం (Active Pharmaceutical Ingredients - API) ప్రధానంగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతుంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణా కష్టతరం కావడం, కంటెయిన్ల కొరత కారణంగా దిగుమతి వ్యయం భారీగా పెరిగింది. కొన్ని కీలక రసాయనాల ధరలు ఏకంగా 200 నుంచి 300 శాతం వరకు పెరుగుతాయి. దీనికి తోడు పెట్రోకెమికల్స్ ధరలు, ప్యాకేజింగ్ మెటీరియల్ ఖర్చులు కూడా తోడవడంతో ఫార్మా కంపెనీలు ఉత్పత్తి వ్యయాన్ని భరించలేక ధరల పెంపు వైపు మొగ్గు చూపుతున్నాయి.

ప్రజలు నిత్యం వాడే అత్యవసర మందులన్నీ ఇప్పుడు ఖరీదైనవిగా మారనున్నాయి.
మరోవైపు, పెరిగిన ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వ నిబంధనలు (DPCO) అడ్డంకిగా మారాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు విక్రయించే వీలు లేకపోవడంతో, చిన్న మరియు మధ్యతరహా ఫార్మా యూనిట్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. లాభాలు రాకపోగా, పెట్టుబడి కూడా తిరిగి రా పలు రాష్ట్రాల్లో ఫార్మా కంపెనీలు షిఫ్టులను తగ్గించాయి. ఇదే కొనసాగితే మందుల కొరత ఏర్పడే పరిస్థితి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంక్షోభం నుండి గట్టెక్కాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఫార్మా అసోసియేషన్లు కోరుతున్నాయి. దిగుమతి సుంకాలను తగ్గించడం లేదా డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (DPCO) కింద ధరల సవరణకు తక్షణ అనుమతులు ఇవ్వడం వంటి చర్యలు చేపడితేనే పరిశ్రమ నిలబడుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. లేనిపక్షంలో సామాన్యుడు జబ్బు పడితే మందులు కొనలేని స్థాయికి చేరుకోవడం ఖాయంగా మారింది.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird