Home Uncategorized ఒంటిమిట్టలో తెలుగు తమ్ముళ్ల సంబరాలు

ఒంటిమిట్టలో తెలుగు తమ్ముళ్ల సంబరాలు

by VRM Media
0 comments

ఒంటిమిట్ట ఏప్రిల్ 3 వ
VRM న్యూస్ బాల మౌలాలి

అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని ఒంటిమిట్ట మండలానికి చెందిన టిడిపి నేతలు గురువారం ఒంటిమిట్ట కోదండ రామాలయం సంబరాలు జరుపుకున్నారు. ఒంటిమిట్ట జడ్పిటిసి అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి, ఒంటిమిట్ట టిడిపి మండల అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి, స్పెషల్ క్లాస్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టు ఎస్.వి.రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టిడిపి పార్టీ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి ఒంటిమిట్ట కోదండ రామాలయం వద్దకు చేరుకున్నారు. బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. జడ్పిటిసి అద్దలూరు ముద్దు కృష్ణ రెడ్డి మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించి మూడుముక్కలాట ఆడారని అన్నారు. నేడు చట్టసభలో అమరావతికి రాజధానిగా తీర్మానం చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని తెలుగు ప్రజలు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇందులకు సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటారని వారు అన్నారు. లాయర్ రామదాసు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేయలేని చట్టసభల్లో తీర్మానంలో కూటమి ప్రభుత్వం చేయడం సాహసంతో కూడుకొన్న విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి ప్రధాన కార్యదర్శి ఆలూరు వెంకటసుబ్బయ్య, టిడిపి నేత బొబ్బిలి రాయుడు, క్లస్టర్ ఇంచార్జి తుమ్మల కుంట ఈశ్వరయ్య, గఫూర్, నరసింహులు, చంద్రపాల్, ఒంటిమిట్ట చెరువు సంఘం ఉపాధ్యక్షులు కట్టాయనా దయ, ఒంటిమిట్ట మండలానికి చెందిన టిడిపి నేతలు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

2,802 Views

You may also like

Leave a Comment