Home ఎంటర్‌టెయిన్మెంట్ ఇండియాలో నిజంగా జరిగిన కథ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ – VRM MEDIA

ఇండియాలో నిజంగా జరిగిన కథ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ – VRM MEDIA

by VRM Media
0 comments
ఇండియాలో నిజంగా జరిగిన కథ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్


-థ్రిల్లర్ చిత్రాలంటే ఇష్టమా
-అయితే ఏ మాత్రం మిస్ అవ్వకండి
-వెంటనే చూసేయండి

థ్రిల్లర్ కధాంశంతో తెరకెక్కిన చిత్రాలు చూస్తుంటే వచ్చే మజానే వేరు. అలాంటిది వాస్తవిక సంఘటనలతో కూడిన థ్రిల్లర్ అయితే ఉన్న పళంగా అన్ని పనులు మానుకొని అతని మూవీ ముందు వాలిపోతాం. పై పెచ్చు వ్యక్తి చిత్రం ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంటే ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా గదిలోకి వెళ్లి మూవీలో లీనమవుతాం. ఇప్పుడు నేను చెప్పబోయే థ్రిల్లర్ మూవీ మీ చేత ఆ పనే చేయించబోతుంది. రెడీగా ఉండండి మరి.

2016లో పంజాబ్ లోని బటిండాలో పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిని తుపాకీతో కాల్చి చంపాడు. అప్పట్లో ఈ విషయం ఎంతగానో సంచలనం సృష్టించడంతో పాటు యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనకు కొంత కల్పిత కథని జోడించి నిర్మించిన చిత్రమే ‘అన్ దేఖి'(ఉండేఖి). ప్రతి ఎపిసోడ్ థ్రిల్లింగ్ గా సాగడంతో పాటు హత్య చుట్టూ అల్లుకున్న కథనం మిమ్మల్ని ఆద్యంతం పిచ్చెక్కిస్తుంది. మొత్తం మూడు సీజన్‌లుగా రూపొందించబడిన మూడు సీజన్‌లు ఇదే విధంగా ఉంటాయి. ఫస్ట్ సీజన్ నుంచి చివరి సీజన్ వరకు ప్రతి ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా హత్యల చుట్టూ సాగుతుంది.

సీజన్ 1 పశ్చిమ బెంగాల్‌లోని సుందరబన్స్ అడవుల్లో మొదలవుతుంది. ఆ తర్వాత మనాలీలో అత్వాల్ కుటుంబంలో పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేసే ఇద్దరు అమ్మాయిలలో ఒకమ్మాయిని చూస్తుండగానే కాల్చి చంపేస్తాడు.ఈ ఘటన జరిగిన పెళ్లి వేడుకని షూట్ చేస్తున్న ఇద్దరు కుర్రాళ్లు తమ కెమెరాలో షూట్ చేస్తారు. అక్కడి నుంచి సీజన్ 1 ముగుస్తుంది.

ఇది కూడా చదవండి: విరోష్: ఇప్పుడు మేము ముగ్గురం కాబోతున్నాం.. రష్మిక పోస్ట్ తో ఫ్యాన్స్ హ్యాపీ

సీజన్ 2 కూడా హత్యలు, దర్యాప్తు చుట్టూ సాగుతుంది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. అత్వాల్ కుటుంబ సభ్యుల నేర చరిత్ర గురించి చెప్తుంది. ఇక సీజన్ 3 గతాన్ని వెంటాడే దెయ్యాలు అట్వాల్ కుటుంబాన్ని వేధించడానికి తిరిగి వచ్చినప్పుడు, కుటుంబ సామ్రాజ్యం కోసం పాపాజీ వేసిన ప్రణాళికలకు అడ్డంకిగా మారుతుంది. ఆ ముప్పుని ఎదుర్కొని అట్వాల్ కుటుంబం ఐక్యంగా నిలబడగలదా, లేక ప్రతీకారానికి బలైపోతుందా? అనేది ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. దిబ్యేందు భట్టాచార్య, హర్ష్ ఛాయా, సూర్య శర్మ, అంకుర్ రథీ, ఐన్ జోయా, ఆంచల్ సింగ్, శివాంగి సింగ్ మరియు వరుణ్ బడోలా ముఖ్యమైన క్యారెక్టర్లను పోషించారు. ఆర్.శుక్లా(ఆర్. శుక్లా)దర్శకత్వం వహించిన ఓటీటీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. IMDBలో ఉన్న 7.9 రేటింగ్ నే అన్ దేఖి చరిష్మాకి ఉదాహరణ. తెలుగులో కూడా అందుబాటులో ఉంది

2,802 Views

You may also like

Leave a Comment