
అంతర్జాతీయ
ఓయి-లింగారెడ్డి గజ్జల
ఓవైపు ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నా.. బుద్ధి మాత్రం మారలేదు. పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి కయ్యానికి కాలుదువ్వుతోంది. భారత్ ఏదైనా ‘ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్’కు హాజరైతే ఏకంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా వరకు వచ్చి ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఆ దేశ మంత్రి ఖవాజా ఆసిఫ్ బరితెగించి వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే ఢిల్లీపై నిందలు వేస్తూ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచేలా శనివారం సిల్‌కోట్‌లో ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
భారత్ తన ఏజెంట్లతో ఏదైనా కృత్రిమ దాడిని సృష్టించి, పాకిస్థాన్‌పై నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆసిఫ్. “మరో దుశ్చర్యకు ప్రయత్నిస్తే, దేవుడి దయతో మేము కలకత్తా వరకు వెళ్తాం” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పాక్ ఉన్మాదానికి పరాకాష్టగా నిలిచాయి. గత వారం భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరికకు స్పందనగా.. పాక్ స్పందన “వేగంగా, నిర్ణయాత్మకంగా” ఇచ్చినట్లు ఆయన బీరాలు పలికారు. వాస్తవానికి ఆగస్టులో కూడా పాక్ సైన్యం ఇలాగే తూర్పు సరిహద్దుల నుండి భారత్‌లోకి లోతుగా దాడులు జరిగాయి.

మంట పెడుతున్న ‘అబ్దుల్ బాసిత్’ అను వ్యాఖ్యలు..
మంత్రి రక్షణ వ్యాఖ్యలు ఒకెత్తయితే, మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసిన సూచనలు వివాదాస్పదంగా మారాయి. ఒకవేళ అమెరికా పాక్ అణు ఆయుధాలను టార్గెట్, బదులుగా భారత్‌లోని ముంబైలోని, దానికి బదులుగా ముంబై వంటి నగరాలపై దాడి చేసింది ఆయన విషం కక్కారు. “ఎవరైనా మాపై దుష్ట దృష్టి వేస్తే, మేము సంకోచం లేకుండా భారతీయ నగరాలపై విరుచుకుపడతాం” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పాక్ నాయకత్వంలోని వికృత ఆలోచనలను బయటపెట్టాయి.
‘ఆపరేషన్ సింధూర్’ సెగలు..
గత ఏడాది ఏప్రిల్ 22న పహల్‌గామ్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకోవడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం. దీనికి ప్రతిగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ ప్రారంభించి ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. అప్పట్లో ఇస్లామాబాద్ మోకాళ్లపైకి వచ్చి కాల్పుల విరమణ కోరడంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. అయితే, ఉగ్రవాదులకు, వారిని పెంచి పోషిస్తున్న పాక్ సైన్యానికి తేడా లేదని భారత్ అప్పట్లోనే కుండబద్దలు కొట్టింది. ఇప్పుడు మళ్లీ పాక్ నేతలు చేస్తున్న ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరిహద్దుల్లో మళ్లీ మంటలు పుట్టించేలా ఉన్నాయి.