Home ట్రెండింగ్ హార్మూజ్ తెరవండ్రా : ఇరాన్ పై బూటులతో రెచ్చిపోయిన ట్రంప్ | హార్ముజ్‌ను వెంటనే తెరవకపోతే పవర్ ప్లాంట్లు మరియు వంతెనలపై దాడులు చేస్తామని ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. – VRM MEDIA

హార్మూజ్ తెరవండ్రా : ఇరాన్ పై బూటులతో రెచ్చిపోయిన ట్రంప్ | హార్ముజ్‌ను వెంటనే తెరవకపోతే పవర్ ప్లాంట్లు మరియు వంతెనలపై దాడులు చేస్తామని ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. – VRM MEDIA

by VRM Media
0 comments
హార్మూజ్ తెరవండ్రా : ఇరాన్ పై బూటులతో రెచ్చిపోయిన ట్రంప్ | హార్ముజ్‌ను వెంటనే తెరవకపోతే పవర్ ప్లాంట్లు మరియు వంతెనలపై దాడులు చేస్తామని ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు.


అంతర్జాతీయ

ఓయ్-బొమ్మ శివకుమార్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధంరోజుకూ ముదురుతోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సైనికులు విరుచుకుపడుతున్నాయి.. అదే సమయంలో ఇరాన్ ఆ దేశాలపై ప్రతీకార దాడులు జరుగుతున్నాయి. ఇక ఇరాన్ కు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా సార్లు వార్నింగ్ ఇచ్చారు. హార్మూజ్ జలసంధిని తెరవాలని.. సంధి చర్చలకు సహకరించాలని అల్టిమేటం ఇచ్చారు. అయినా ఇరాన్.. ట్రంప్ మాటలను పెడ చెవిన పెడుతోంది. యుద్ధాన్ని భీకరంగా కొనసాగుతోంది. ఈ పరిణామాల మధ్య ట్రంప్ మరోసారి ఇరాన్ కు అల్టిమేటం జారీ చేశారు.

అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ తక్షణమే తెరవాలని ట్రంప్ మరోసారి అల్టిమేటం జారీ చేశారు. లేకపోతే 48 గంటల్లో పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలపై దాడులు జరుగుతున్నాయని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఇరాన్ పై బూతులతో రెచ్చిపోయారు ట్రంప్. హార్మూజ్ జలసంధిని తెరవండి బా**ర్డ్స్ అంటూ ఫైర్ అయ్యారు. లేదంటే నరకానికి పంపిస్తా.. చూస్తూ ఉండండి.. అల్లాను ప్రార్థించండి అంటూ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. ఇరాన్ మాత్రం ట్రంప్ మాటలను అస్సలు లెక్కచేయడం లేదు. దాడులను కొనసాగిస్తూనే ఉంది.

ఇదివరకే ట్రంప్ ఇరాన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హార్మూజ్ జలసంధిని ఇరాన్ ఓపెన్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఒప్పందం చేసుకునేందుకు లేదా హార్మూజ్ ను తెరిచేందుకు 10 రోజుల గడువు ఇచ్చాను.. సమయం మించిపోతుంది.. వారిపై ప్రళయం విరుచుకుపడేందుకు ఇక కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉంది.. అని ట్రూత్ సోషల్ ట్రంప్ పోస్ట్ చేశారు. ట్రంప్ మాటలను లెక్కచేయని ఇరాన్ అదే పని సరిహద్దు అరబ్ దేశాల్లోని మౌలిక సదుపాయాలు, ఆర్థిక వనరులపై దాడులకు గురవుతోంది. ఈ కోరనే ట్రంప్ ఇవాళ మరోసారి ఇరాన్ పై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

హార్ముజ్‌ను వెంటనే తెరవకపోతే పవర్ ప్లాంట్లు మరియు వంతెనలపై దాడులు చేస్తామని ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు.

మరోవైపు అమెరికాకు చెందిన ఎఫ్-15 ఈ స్ట్రైక్‌ ఈగల్‌ యుద్ధ విమానం కూలిపోయిన ఘటనలో రెండో పైలట్‌ ను గుర్తించినట్లు అంతర్జాతీయ మీడియా తాజాగా వెల్లడించింది. ఆ పైలట్ సురక్షితంగా ఉన్నాడని.. అమెరికా సైన్యం ఆధీనంలోనే ఉన్నట్లు గుర్తించబడింది. ఈ నెల 3న అమెరికాకు చెందిన యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిలో ఒక పైలట్‌ ను గా.. రెండో పైలట్‌లో కనిపించిన అమెరికా, ఇరాన్‌ అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇక ప్రస్తుతం ఇద్దరు పైలట్లను ఇరాన్ భూభాగం నుంచి తీసుకొచ్చేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తోంది.



2,801 Views

You may also like

Leave a Comment