
అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
పశ్చిమాసియాలో నెల రోజులకు పైగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్- అమెరికా- ఇజ్రాయెల్ మధ్య దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సైనికులు విరుచుకుపడుతున్నాయి.. అదే సమయంలో ఇరాన్ ఆ దేశాలపై ప్రతీకార దాడులు జరుగుతున్నాయి. మరోవైపు యుద్ధం కారణంగా ఇరాన్ తన బ్రహ్మాస్త్రమైన హార్మూజ్ జలసంధిని మూసివేసింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్‌లో గ్యాస్, చమురు ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో కూరుకుపోయాయి. అయితే పెరిగిన గ్యాస్, పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందేందుకు నేపాల్ కీలక నిర్ణయం తీసుకుంది.
కొరత కారణంగా నేపాల్ లో పెట్రోల్ వారానికి రెండు రోజులు సెలవులకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులకు శనివారం, ఆదివారం సెలవు రోజులుగా ప్రకటించారు. గతంలో శనివారం ఒక్కరోజు మాత్రమే సెలవు ఉండేది. కానీ ప్రస్తుత పరిణామాల మధ్య రెండు రోజుల పాటు సెలవు దినాలను అధికారులు ప్రకటించారు. ఇదే విషయంపై ప్రభుత్వ అధికార ప్రతినిధి సాస్మిత పోఖారెల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల పని దినాలను కూడా సవరించినట్లు తెలిపారు. గవర్నమెంట్ కార్యాలయాలు ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పని చేయాలని సూచిస్తున్నాయి.
పెట్రోల్ కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి సాస్మిత పోఖారెల్ తెలిపారు. తాజాగా తీసుకున్న నిర్ణయాలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. శని, ఆదివారాలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టైమింగ్స్ కేవలం ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమేనని విద్యాసంస్థలకు కాదని స్పష్టం చేశారు.

ఇక ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా నేపాల్ అట్టుడుకుతోంది. విమాన ఇంధన ధరలను అక్కడి ప్రభుత్వం 117.4 శాతం పెంచేసింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ విమానాలకు వర్తిస్తుంది. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నేపాల్ ఆయిల్ ఇంధన ధరలను పెంచేసింది. అంతర్జాతీయ విమానాలకు ఇంధన ధరలను వరుసగా 84.7 శాతం, 116.2 శాతం, 117.4 శాతం మేర పెంచుతూ కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు నేపాల్ రాజధాని ఖాత్ మండూ లో లీటర్ పెట్రోల్ ధర ఇప్పుడు రూ. 202 గా ఉంది. డీజిల్, కిరోసిన్ ధరలు కూడా లీటర్ కు రూ. 182 కు పెరిగాయి. దాంతో నేపాల్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.