
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
వేసవితాపంతో అల్లాడుతున్న ఏపీ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రేపాటి నుంచి రెండు రోజుల పాటు మిశ్రమ వాతావరణం (వాతావరణం) ఉండబోతోందని. ఇందులో భాగంగా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని, అలాగే ఇంకొన్ని చోట్ల వడగాల్పులు కూడా ఉంటాయని. అయితే ఇవి ఎక్కడెక్కడ ఉంటాయన్న వివరాలు కూడా ఉన్నాయి.
రానున్న రెండు రోజులు వివిధ వాతావరణ పరిస్థితులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు,ఎల్లు మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు, మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండలు ప్రభావం చూపే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర -పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఆవర్తనం కొనసాగుతుందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాయలసీమ మరియు పరిసర ప్రాంతాలపై మరోక ఆవర్తనం విస్తరించిందని పేర్కొన్నారు.

వీటి ప్రభావంతో రేపు, ఎల్లుండి మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరని హెచ్చరిక. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం.
అయితే రేపు పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలుల ప్రభావం కనిపించింది.